దేశ వ్యాప్తంగా జరుగుతున్న 16వ యూత్ నేషనల్ చాంపియన్‌షిప్ ఈవెంట్‌లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. గురువారం చత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో ఈ ఈవెంట్లు జరిగాయి. 100మీ ఈవెంట్‌లో సిల్వర్ పతకాన్ని గెలుచుకున్న మరుసటి రోజే జీవంజీ దీప్తి 200మీ. ఈవెంట్‌లో రెండో పతకాన్ని గెలుచుకుంది.
రాష్ట్ర స్థాయి అథ్లెట్ అయిన దీప్తి 25.15 సెకండ్లలోనే 200మీటర్ల పరుగు పందాన్ని పూర్తి చేయగలిగింది. 200మీటర్లు పురుషుల విభాగంలో రాష్ట్రానికి చెందిన అంకిత్ చౌహాన్ 22.53 సెకన్లలో పూర్తి చేసి సిల్వర్‌ను దక్కించుకున్నాడు.
ఈ ఈవెంట్ నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశ్యం.. యూత్ ఆసియా ఈవెంట్‌లో పాల్గొనేందుకు చేయాల్సిన క్రీడాకారుల ఎంపికలో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేడుక బ్యాంకాక్ వేదికగా జరగనుంది.