Vinod Kambli : వినోద్ కాంబ్లీ ఇంకా పూర్తిగా కోలుకోలేదా? అత‌డి సోదరుడు ఏం చెప్పాడంటే?

టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు వినోద్ కాంబ్లీ (Vinod Kambli) అనారోగ్యం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ప్ర‌స్తుతం బాంద్రాలోని

Vinod Kambli : వినోద్ కాంబ్లీ ఇంకా పూర్తిగా కోలుకోలేదా? అత‌డి సోదరుడు ఏం చెప్పాడంటే?

Vinod Kambli Brother Shares Concerning Health Update

Updated On : August 20, 2025 / 4:34 PM IST

Vinod Kambli : టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు వినోద్ కాంబ్లీ అనారోగ్యం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ప్ర‌స్తుతం బాంద్రాలోని త‌న నివాసంలో కోలుకుంటున్నాడ‌ని, స‌రిగ్గా మాట్లాడ‌లేక‌పోతున్నాడ‌ని అత‌డి సోద‌రుడు వీరేంద్ర కాంబ్లీ వెల్ల‌డించాడు.

‘కాంబ్లీ (Vinod Kambli ) ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంది. ఇంట్లోనే అత‌డికి చికిత్స కొన‌సాగుతోంది. అత‌డు స‌రిగ్గా మాట్లాడ‌లేక‌పోతున్నాడు. అత‌డు కోలుకునేందుకు స‌మ‌యం ప‌డుతుంది. అత‌డొక ఛాంపియ‌న్‌. కోలుకుని తొంద‌ర‌లోనే తిరిగి వ‌స్తాడు. అత‌డు త్వ‌ర‌లోనే న‌డ‌వ‌డం, ప‌రిగెత్త‌డం ప్రారంభిస్తాడ‌ని ఆశిస్తున్నాను. అత‌డిపై నాకు చాలా న‌మ్మ‌కం ఉంది. అత‌డిని మ‌ళ్లీ మైదానంలో చూస్తార‌ని ఆశిస్తున్నా.’ అని వీరేంద్ర తెలిపాడు.

The Hundred 2025 : వామ్మో.. సూప‌ర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ క్యాచ్ ప‌ట్టిన ఆర్‌సీబీ స్టార్ ఆట‌గాడు..

కాంబ్లీ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు చేయాల‌ని వీరేంద్ర విజ్ఞ‌ప్తి చేశాడు. ‘ఇటీవ‌ల కాంబ్లీకి మెద‌డు స్కాన్‌, మూత్ర ప‌రీక్ష‌తో పాటు శ‌రీరం మొత్తానికి ప‌రీక్ష‌లు చేశారు. పెద్ద‌గా స‌మ‌స్య‌లు లేవు. అయితే.. అత‌డు న‌డ‌వ‌లేక‌పోతున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డికి ఫిజియోథెర‌పీ చేయించుకోవాల‌ని స‌ల‌హా ఇచ్చారు. ప్ర‌స్తుతం అత‌డికి మీ అంద‌రి మ‌ద్ద‌తు, ప్రేమ అవ‌స‌రం.’ అని వీరేంద్ర అన్నాడు.

గ‌తేడాది తీవ్ర‌మైన అనారోగ్యంతో..

గ‌తేడాది తీవ్రమైన మూత్రనాళ ఇన్ఫెక్షన్‌ కారణంగా కాంబ్లీని థానేలోని ఆకృతి హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్య పరీక్షల్లో అతడి మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతోందని తేలడంతో ఐసీయూలోనే ఉంచి చికిత్స అందించారు. కొంచెం కోలుకున్న త‌రువాతి డిశార్జి చేసిన సంగ‌తి తెలిసిందే.

Keshav Maharaj : చరిత్ర సృష్టించిన కేశవ్‌ మ‌హారాజ్.. స‌పారీ క్రికెట‌ర్ల‌లో ఒకే ఒక్కడు..

1991లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు వినోద్ కాంబ్లీ. 2000 వ‌ర‌కు టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వ‌హించాడు. త‌న కెరీర్‌లో మొత్తంగా టీమ్ఇండియా త‌రుపున కాంబ్లీ 17 టెస్టులు, 104 వ‌న్డేలు ఆడాడు. టెస్టుల్లో 54.2 స‌గ‌టుతో 1084 ప‌రుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచ‌రీలు, మూడు హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. 104 వ‌న్డేల్లో 32.6 స‌గ‌టుతో 2477 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు సెంచ‌రీలు, 14 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.