Pro Kabaddi 2021 : తమిళ్ తలైవాస్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న తెలుగు టైటాన్స్

ఈ సారైనా తొలి టైటిల్ ముద్దాడాలని తెలుగు టైటాన్స్ ఆశగా ఎదురుచూస్తుంది. ఒక్కసారి కూడా ఫైనల్ చేరని జట్టుకు రెండో సీజన్‌లో మూడో స్థానంలో నిలవడమే అత్యుత్తమ ప్రదర్శన.

Pro Kabaddi

Pro Kabaddi: ఈ సారైనా తొలి టైటిల్ ముద్దాడాలని తెలుగు టైటాన్స్ ఆశగా ఎదురుచూస్తుంది. ఒక్కసారి కూడా ఫైనల్ చేరని జట్టుకు రెండో సీజన్‌లో మూడో స్థానంలో నిలవడమే అత్యుత్తమ ప్రదర్శన. గత సీజన్ ను 11వ స్థానంలో ముగించిన జట్టు ఈ సారైన అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.

గెలుపు కోసం చేసే ప్రయత్నంలో జట్టులో మార్పులు చేశారు. గత సీజన్‌లో రాణించిన సిద్ధార్థ్‌ దేశాయ్‌ను జట్టు తిరిగి దక్కించుకోవడంతో పాటు ఆరో సీజన్‌లో బెంగళూరు బుల్స్‌ను విజేతగా నిలిపిన రోహిత్‌ కుమార్‌ను సొంతం చేసుకుని కెప్టెన్‌గా నియమించారు. మరోవైపు డిఫెన్స్‌ విభాగంలో సురేందర్‌, సందీప్‌, అరుణ్‌ లాంటి డిఫెండర్లను జట్టులోకి తీసుకున్నారు.

కోచ్‌ జగదీశ్‌ కుంబ్లే వ్యూహాలకు మేలు చేస్తాయని మేనేజ్మెంట్‌ భావిస్తోంది. అన్ని విభాగాల్లో పటిష్ఠంగా కనిపించేందుకు జట్టు అన్ని విభాగాల్లో మార్పులు చేసింది. సీజన్‌ తొలి రోజే మొదటి మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌తో తలపడుతున్న తెలుగు టైటాన్స్‌ శుభారంభం చేయాలనే పట్టుదలతో ఉంది. రాత్రి 8గంటల 30నిమిషాలకు మొదలుకానుంది మ్యాచ్.

…………………………..: ఇజ్రాయెల్‌లో తొలి ఒమిక్రాన్ మరణం

తెలుగు టైటాన్స్ షెడ్యూల్

* డిసెంబర్ 22న తమిళ్ తలైవాస్‌తో
* డిసెంబర్ 25న పుణెరీ పల్టాన్‌తో
* డిసెంబర్ 28న హర్యానా స్టీలర్స్‌తో
* జనవరి 1న బెంగళూరు బుల్స్‌తో
* జనవరి 3న పట్నా పైరేట్స్‌తో
* జనవరి 5న దబాంగ్ ఢిల్లీతో
* జనవరి 8న యూ ముంబాతో
* జనవరి 11న గుజరాత్ జయింట్స్‌తో
* జనవరి 15న యూపీ యోధాస్‌తో
* జనవరి 17న బెంగాల్ వారియర్స్‌తో
* జనవరి 19న పింక్ పాంథర్స్‌తో

…………………………….. : అక్రమ ఫ్లెక్సీకి రూ. లక్ష జరిమానా