Omicron Death : ఇజ్రాయెల్‌లో తొలి ఒమిక్రాన్ మరణం

ఇజ్రాయెల్‌ లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఇప్పటికే మూడోడోస్‌ ఇచ్చిన ఇజ్రాయెల్‌ ఇప్పుడు 60 ఏళ్లు పైబడిన వారు, వైద్య సిబ్బందికి నాలుగోడోస్‌ ఇవ్వాలని నిర్ణయించింది.

Omicron Death : ఇజ్రాయెల్‌లో తొలి ఒమిక్రాన్ మరణం

Isreal

first Omicron death in Israel : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. డెల్టా వేరియంట్‌ను మించిన దూకుడుతో పాకేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య లక్ష దాటిపోయింది. ఇజ్రాయెల్‌ లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. దీంతో మరిన్ని కఠిన ఆంక్షలకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే మూడోడోస్‌ ఇచ్చిన ఇజ్రాయెల్‌ ఇప్పుడు 60 ఏళ్లు పైబడిన వారు, వైద్య సిబ్బందికి నాలుగోడోస్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఇక ఫ్రాన్స్‌లో నమోదవుతున్న కొత్త కేసుల్లో 20శాతం ఒమిక్రానే అని ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Omicron : అమెరికాలో ఒమిక్రాన్ పంజా.. 73శాతం కేసులతో డెల్టాను దాటేసింది!

మరోవైపు ఒమిక్రాన్ దెబ్బకు అమెరికా అల్లాడిపోతోంది. ఇటీవలే అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. నమోదవుతున్న కొత్త కేసుల్లో ఒమిక్రాన్ కేసులు భారీగా ఉండటంతో దాన్ని కట్టడి చేయడంపై దృష్టిపెట్టింది. అధికారులు, వైద్య నిపుణులతో అధ్యక్షుడు జోబైడెన్‌ చర్చించారు. దేశవ్యాప్తంగా 50కోట్ల ఉచిత కోవిడ్‌ టెస్ట్‌లు చేయాలని నిర్ణయించారు.

దీంతో పాటు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఆసుపత్రులకు అదనపు సాయం చేయనున్నారు. వేయిమంది ఆర్మీ వైద్య సిబ్బందిని ఆసుపత్రుల్లో సేవలకు వినియోగించనున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తి ఒమిక్రాన్‌తో చనిపోవడంతో ప్రజలు సాధ్యమైనంత త్వరగా బూస్టర్‌ డోస్‌లు తీసుకోవాలని బైడెన్ విజ్ఞప్తి చేశారు.