Telugu Women Cricketers: డబ్ల్యూపీఎల్-2023లో ఆరుగురు తెలుగు అమ్మాయిలు.. ఏ జట్టుకు.. ఎంత ధరను పొందారంటే?

మహిళల ప్రీమియర్ లీగ్ 2023 (WPL 2023) వేలం ప్రక్రియ సోమవారం జరిగింది. ఇండియా మహిళా ప్లేయర్లను అత్యధిక ధరలు చెల్లించి ప్రాచైంజీ యాజమాన్యాలు దక్కించుకున్నాయి. అందులో తెలుగు అమ్మాయిలుకూడా ఉన్నారు.

WPL 2023

Telugu Women Cricketers: మహిళల ప్రీమియర్ లీగ్ 2023 (WPL 2023) వేలం ప్రక్రియ సోమవారం జరిగింది. ఇండియా మహిళా ప్లేయర్లను అత్యధిక ధరలు చెల్లించి ప్రాచైంజీ యాజమాన్యాలు దక్కించుకున్నాయి. అందులో తెలుగు అమ్మాయిలుకూడా ఉన్నారు. తొలిసారి జరగనున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆరుగురు తెలుగు మహిళా ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. వీరిలో అంజలి శర్వాణీని యూపీ వారియర్జ్ యాజమాన్యం అత్యధిక ధర చెల్లించి దక్కించుకుంది.  డబ్ల్యూపీఎల్ వేలంలో చోటు దక్కించుకున్న తెలుగు మహిళా క్రికెటర్లలో అంజలి శర్వాణితో పాటు సబ్బినేని మేఘన, షబ్నమ్ షకీల్, సొప్పదండి యషశ్రీ, అరుంధతి రెడ్డి, స్నేహ దీప్తిలు ఉన్నారు.

Anjali Sarvani

అంజలి శర్వాణి ..

అంజలి శర్వాణి స్వస్థలం కర్నూల్ జిల్లా. భారత్ తరపున ఆమె ఆరు టీ20 మ్యాచ్ లు ఆడింది. లెఫ్టార్మ్ పేస్ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించగల సత్తా కలిగిన ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుత డబ్ల్యూపీఎల్ వేలంలో అంజలి శర్వాణీని యూపి వారియర్జ్ రూ. 55లక్షలకు దక్కించుకుంది.

Sabbhineni Meghana

సబ్బినేని మేఘన..

సబ్బినేని మేఘన స్వస్థలం విజయవాడ. భారత్ తరపున మూడు వన్డేలు, 17 టీ20 మ్యాచ్ లు ఆడింది. బ్యాట్స్‌మెన్. పలుసార్లు జట్టు విజయంలో కీలక భూమిక పోషించింది. ప్రస్తుతం సబ్బినేని మేఘననురూ. 30లక్షలు చెల్లించి గుజరాత్ జెయింట్స్ దక్కించుకుంది.

Shabnam Shakil

షబ్నమ్ షకీల్ ..

విశాఖపట్టణంకు చెందిన షబ్నమ్ షకీల్ రైట్ ఆర్మ్ పేస్ బౌలర్. ఇటీవల అండర్-19 ప్రపంచకప్‌లో ఆడింది. షబ్నమ్ షకీల్‌ను రూ. 10లక్షలకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకుంది.

 

Soppadhandi Yashasri

సొప్పదండి యషశ్రీ ..

సొప్పదండి యషశ్రీ స్వస్థలం హైదరాబాద్. ఫేస్ బౌలర్. తక్కువ సమయంలోనే యషశ్రీ ఫాస్ట్‌బౌలింగ్‌పై పట్టు సాధించింది. హైదరాబాద్‌ అండర్‌-19 జట్టుకు కెప్టెన్‌ అయ్యింది. ఇటీవల అండర్ -19 ప్రపంచ కప్‌లో ఆడి అద్భుత ప్రతిభను కనబర్చింది. యషశ్రీని రూ. 10లక్షలకు యూపీ వారియర్స్ దక్కించుకుంది.

Arundhati Reddy

అరుంధతి రెడ్డి..

అరుంధతి రెడ్డి స్వస్థలం హైదరాబాద్. రైట్ ఆర్మ్ ఫేస్ బౌలర్. ఈ మహిళా క్రికెటర్ భారత్ తరపున 26 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ప్రస్తుతం డబ్ల్యూపీఎల్ వేలంలో.. రూ. 30లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ అరుంధతి రెడ్డిని దక్కించుకుంది.

Sneha Deepthi

స్నేహా దీప్తి ..

స్నేహా దీప్తి స్వస్థలం విశాఖపట్టణం. ఆమె బ్యాటర్. భారత్ జట్టు తరపున ఒక వన్డే, రెండు టీ20 మ్యాచ్ లు ఆడింది. డబ్ల్యూపీఎల్ వేలంలో రూ. 30లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ స్నేహ దీప్తిని దక్కించుకుంది.