×
Ad

BCCI : పాక్ ఆట‌గాళ్ల‌పై ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు.. రెచ్చ‌గొట్టేలా ప్ర‌వ‌ర్తించారు..

పాక్ ఆట‌గాళ్ల హ‌రిస్ ర‌వూఫ్‌, సాహిబ్‌జాదా ఫర్హాన్ పై ఐసీసీకి బీసీసీఐ (BCCI) ఫిర్యాదు చేసింది.

The BCCI has reported an official complaint against Haris Rauf and Shahibzada Farhan.

BCCI : ఆసియాక‌ప్ 2025 సూప‌ర్‌-4లో భాగంగా ఆదివారం (సెప్టెంబ‌ర్ 21న‌) భార‌త్‌, పాక్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో పాక్ ఆట‌గాళ్లు హ‌రిస్ ర‌వూఫ్‌, సాహిబ్‌జాదా ఫర్హాన్ లు రెచ్చ‌గొట్టే హావ‌భావాల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఇప్ప‌టికే వీరిపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. పాక్ ఆట‌గాళ్ల చ‌ర్య‌ల‌ను ఏ మాత్రం స‌హించ‌ని బీసీసీఐ ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్లు రెచ్చ‌గొట్టే హావ‌భావాలు ప్ర‌ద‌ర్శించార‌ని ఐసీసీకి ఫిర్యాదు చేసింది.

ఈ-మెయిల్ రూపంలో బీసీసీఐ ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం. దీంతో ఈ ఇద్ద‌రు ఆట‌గాళ్ల నుంచి ఐసీసీ లిఖితపూర్వక వివరణ కోరే అవకాశం ఉన్న‌ట్లు క్రికెట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. లిఖిత పూర్వ‌క వివ‌ర‌ణ ఇచ్చేందుకు వీరిద్ద‌రు గ‌నుక తిర‌స్క‌రిస్తే అప్పుడు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫ‌రీ రిచీ రిచ‌ర్డ్‌స‌న్ ఎదుట హాజ‌రు కావాల్సి ఉంటుంది.

Abhishek Sharma : బంగ్లాదేశ్‌ను చిత‌క్కొట్ట‌డానికి కార‌ణం అదే.. అభిషేక్ శ‌ర్మ కామెంట్స్‌..

ఏం జ‌రిగిందంటే.?
సెప్టెంబ‌ర్ 21న భార‌త్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీ చేసిన త‌రువాత ఫ‌ర్హాన్ త‌న బ్యాట్‌తో గ‌న్ షాట్ చూపిస్తూ హావ‌భావాలు ప్ర‌ద‌ర్శించాడు. ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు ఉన్న నేప‌థ్యంలో అత‌డు ఇలా చేయ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. అప్ప‌టిక‌ప్పుడు అలా సంబ‌రాలు చేసుకున్నాన‌ని, ఎవ‌రు ఎమ‌నుకున్నా ప‌ట్టించుకోన‌ని త‌న చర్య‌ను స‌మ‌ర్ధించుకునే ప్ర‌య‌త్నం చేశాడు ఫ‌ర్హాన్‌.

Jaker Ali : అందుకే భార‌త్ పై ఓడిపోయాం.. లేదంటేనా.. బంగ్లాదేశ్ కెప్టెన్ జాకీర్ అలీ కామెంట్స్‌..

ఇక హ‌రిస్ ర‌వూఫ్ అయితే.. బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో జెట్ ఫ్లైట్‌లు కూలిన‌ట్లుగా 6-0 అని సైగ‌లు చేశాడు. ఆప‌రేష‌న్ సింధూర్ స‌మ‌యంలో భార‌త్‌కు చెందిన ఆరు యుద్ధ విమానాల‌ను కూల్చిన‌ట్లు పాక్ ప్ర‌భుత్వం చెప్పిన సంగ‌తి తెలిసిందే. దానిని గుర్తు చేసేలా హ‌రిస్ ప్ర‌వ‌ర్త‌న ఉంద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అంతేకాదు.. మైదానంలో టీమ్ఇండియా ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్ గిల్‌ల‌తో అత‌డు వాగ్వాదానికి సైతం దిగాడు.