SRH vs MI
SRH vs MI: ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియానికి వచ్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు ఛేదించేందుకు బరిలోకి దిగింది.
IPL 2023, SRH vs MI:కష్టాల్లో సన్‌రైజర్స్.. నాలుగు డౌన్..Live Updates
ఓ వైపు హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా మరో వైపు స్టేడియంలో గొడవ జరిగింది. మద్యం తాగిన కొందరు మ్యాచ్ చూసేందుకు వచ్చారు. అయితే ఏమైందో తెలీదు గానీ తాగుబోతులతో క్రికెట్ అభిమానులకు మధ్య గొడవ జరిగింది. గమనించిన పోలీసులు గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. అయితే.. మద్యం మత్తులో ఉన్న వారు పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు వారిని మైదానం నుంచి బయటకు పంపించి వేశారు.