The Wait Is Finally Over Karnam Malleswari
Karnam Malleswari : మీరాబాయి చాను ఒలింపిక్స్ లో పతకం సాధించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. భారత ప్రధాన మంత్రి, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అభినందనలు తెలియచేస్తున్నారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ కాంస్య పతకం విజేత కరణం మల్లీశ్వరి స్పందించారు. మిరాబాయి పతకం సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు.
Read More : Narappa : మాస్క్ పెట్టుకోమన్న పోలీసులు.. సినిమా చూడండంటున్న సురేష్ ప్రొడక్షన్స్..
చాలా సంవత్సరాల తర్వాత…వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పతకం రావడం..భవిష్యత్ లో ఈ క్రీడకు మంచి ప్రోత్సాహం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మిగతా క్రీడాకారులు బాగా ఆడి పతకం సాధించాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్ లో భారతదేశానికి సుమారు 10 నుంచి 12 మెడల్స్ వస్తాయని అనుకుంటున్నట్లు, క్రీడాకారులకు మంచి శిక్షణనిచ్చి అక్కడకు తీసుకెళ్లారన్నారు.
Read More : Asteroid : భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. తాజ్ మహల్ కంటే 3 రెట్లు పెద్దదట!
తాను ఆడే సమయంలో ఉన్న పరిస్థితి..ఇప్పుడున్న పరిస్థితులు వేరేగా ఉన్నాయన్నారు. మెడల్స్ గెలిచిన వారికి పోటీ పడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని, క్రీడాకారులకు కేంద్రం అన్ని విధాలుగా ప్రోత్సాహం ఇస్తోందన్నారు. క్రీడల్లోకి రావాలని అనుకొనే వారు..క్రమశిక్షణతో..ఏకాగ్రతతో దృష్టి సారించాలని సూచించారు. మౌలిక సదుపాయాలపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తే..ఇంకా అనేక మెడల్స్ వస్తాయన్నారు కరణం మల్లీశ్వరి.