Asteroid : భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. తాజ్ మహల్ కంటే 3 రెట్లు పెద్దదట!

తాజ్ మహల్ కంటే మూడు రేట్లు పెద్దగా ఉన్న ఓ గ్రహశకలం భూమి వైపుకు దూసుకొస్తున్నట్లు అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. 220 మీటర్ల వ్యాసార్థం గల ‘2008 GO20’ అనే గ్రహశకలం జులై 25 తెల్లవారుజామున 3 గంటల సమయంలో భూమికి అత్యంత దగ్గరగా రానుందని శాత్రవేత్తలు తెలిపారు.

Asteroid : భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. తాజ్ మహల్ కంటే 3 రెట్లు పెద్దదట!

Asteroid

Asteroid :  తాజ్ మహల్ కంటే మూడు రేట్లు పెద్దగా ఉన్న ఓ గ్రహశకలం భూమి వైపుకు దూసుకొస్తున్నట్లు అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. 220 మీటర్ల వ్యాసార్థం గల ‘2008 GO20’ అనే గ్రహశకలం జులై 25 తెల్లవారుజామున 3 గంటల సమయంలో భూమికి అత్యంత దగ్గరగా రానుందని శాత్రవేత్తలు తెలిపారు.

ఇది గంటకు 29000 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని చెబుతున్నారు. ఈ గ్రహశకలం సెకనుకి 8 మైళ్ళ వేగంతో దూసుకురానుంది. భూమి నుంచి 4.7 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ప్రయాణించనుంది. ఇక ఈ శకలం కదలికలను నాసా ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. కక్ష్య మార్చుకుంటే భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని నాసా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఇదే జరిగితే వినాశమనేనని తప్పదని భావిస్తున్నారు. అయితే నాసా గ్రహశకలాలను మళ్లించగల ఓ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. ఇది విజయవంతమైతే.. ఇలాంటి గ్రహశకలాలు భూమివైపుకు వచ్చినప్పుడు వాటి గమనాన్ని మళ్లించవచ్చు.