RCB Bench Players : ఛాంపియ‌న్ జ‌ట్టులో భాగ‌మై.. ఒక్క మ్యాచ్ ఆడ‌ని ఆర్‌సీబీ ఆట‌గాళ్లు.. వేలంలో కోట్ల వ‌ర్షం

విజేత జ‌ట్టులో భాగ‌మైన‌ప్ప‌టికి కూడా ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌ని ఆర్‌సీబీ (RCB) ఆట‌గాళ్లు వీరే..

These nine players are not playing in a single match for RCB in IPL 2026

  • ఐపీఎల్ 2026 విజేత‌గా ఆర్‌సీబీ
  • మొత్తం 24 మంది స్క్వాడ్‌లో 15 మంది మాత్ర‌మే సీజ‌న్‌లో ఆడారు
  • 9 మందికి ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవ‌కాశం రాలేదు

RCB bench players : ఐపీఎల్ 2026 సీజ‌న్ విజేత‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు నిలిచింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌ను ఓడించి వ‌రుస‌గా రెండో సారి ట్రోఫీని ముద్దాడింది. విరాట్ కోహ్లీ, దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్, ర‌జ‌త్ పాటిదార్‌, వెంక‌టేశ్ అయ్య‌ర్, భువ‌నేశ్వ‌ర్ కుమార్, జోష్ హేజిల్ వుడ్ వంటి ఆట‌గాళ్లు జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు.

మెగా వేలంలో ఆర్‌సీబీ మొత్తం 24 మంది ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. వీరిలో 15 మంది క‌నీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడారు. మిగిలిన 9 మంది ఆట‌గాళ్ల‌కు ఈ ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఒక్క‌టంటే ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవ‌కాశం రాలేదు. అయిన‌ప్ప‌టికి కూడా వీళ్ల‌కు పూర్తి సీజ‌న్ ఫీజు అంటే మెగా వేలంలో ఎవ‌రిని ఎంత మొత్తానికి కొనుగోలు చేశారో అంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

ఛాంపియ‌న్ టీమ్‌లో భాగ‌మై.. ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌ని ఆట‌గాళ్లు ఎవ‌రో ఓ సారి చూద్దాం..

య‌శ్ ద‌యాల్‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు ముందు ఈ ఎడ‌మ‌చేతి వాటం పేస‌ర్‌ను ఆర్‌సీబీ 5 కోట్ల‌కు రిటైన్ చేసుకుంది. అయితే.. ఈ సీజ‌న్‌కు ముందు అత‌డు వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో త‌ప్పుకున్నాడు. అయిన‌ప్ప‌టికి కూడా ఆర్‌సీబీ అత‌డిని విడుద‌ల చేయ‌లేదు. మ‌రో ఆట‌గాడిని తీసుకులేదు. దీంతో అత‌డు ఆర్‌సీబీలో భాగంగానే ఉన్న‌ట్లు.

*IPLలో 5 టీమ్స్ లో ఆడిన ప్లేయర్.. టీమిండియాకు ప్రాతినిధ్యం.. ఇప్పుడు ఏకంగా మంత్రి..

మంగేష్ యాద‌వ్..
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన ఎడ‌మ‌చేతి వాటం పేస‌ర్ మంగేష్ యాద‌వ్ ను ఆర్‌సీబీ వేలంలో 5.20 కోట్ల‌కు కొనుగోలు చేసింది. అయితే.. భువ‌నేశ్వ‌ర్ కుమార్, రసిఖ్ సలాం దార్ వంటి పేస‌ర్లు అద్భుతంగా రాణిస్తుండ‌డం, కూర్పులో భాగంగా మంగేష్ యాద‌వ్ కు ఒక్క మ్యాచ్‌లో ఆడే అవ‌కాశం రాలేదు.

నువాన్ తుషారా..
శ్రీలంక పేస‌ర్ నువాన్ తుషారాను ఆర్‌సీబీ 1.60 కోట్ల‌కు రిటైన్ చేసుకుంది. ఫిట్‌నెస్ స‌మ్య‌స‌లు, జ‌ట్టు కూర్పు కార‌ణంగా అత‌డు తుది జ‌ట్టులో చోటు ద‌క్కించుకోలేక‌పోయాడు. ప్లేఆఫ్స్‌కు ముందు అత‌డి స్థానంలో ఇంగ్లాండ్ పేస‌ర్ రిచ‌ర్డ్ గ్లీస‌న్‌ను ఆర్‌సీబీ తీసుకుంది.

జోర్డాన్ కాక్స్‌..
ఇంగ్లాండ్‌కు చెందిన వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ అయిన జోర్డాన్ కాక్స్‌ను ఆర్‌సీబీ వేలంలో 75లక్ష‌ల‌కు కొనుగోలు చేసింది. అత‌డు బ్యాక‌ప్ వికెట్ కీప‌ర్‌గా ఉన్నారు. టీమ్ఇండియా ఆట‌గాడు జితేశ్ శ‌ర్మ ప్ర‌తి మ్యాచ్ తుది జ‌ట్టులో ఉండ‌డంతో జోర్డాన్‌కు ఒక్క మ్యాచ్ ఆడే అవ‌కాశం రాలేదు.

స్వ‌ప్నిల్ సింగ్‌..
స్పిన్న‌ర్ స్వ‌ప్నిల్ సింగ్‌ను ఆర్‌సీబీ 50ల‌క్ష‌ల‌కు అట్టిపెట్టుకుంది. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మలు ఉండ‌డంతో స్విప్నిల్‌కు తుది జ‌ట్టులో ఆడే ఛాన్స్ రాలేదు.

విక్కీ ఓస్త్వాల్‌..
అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్‌లో అద‌ర‌గొట్టిన భార‌త స్పిన్ ఆల్‌రౌండ‌ర్ విక్కీ ఓస్త్వాల్ ను 30 ల‌క్ష‌ల‌కు ద‌క్కించుకుంది. విరాట్ కోహ్లీ, ప‌డిక్క‌ల్‌, జితేశ్, వెంక‌టేశ్ అయ్య‌ర్ వంటి స్టార్ ఆట‌గాళ్లు ఉండ‌డంతో ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవ‌కాశం రాలేదు.

*Tim David : ఆర్‌సీబీకి బిగ్ షాక్‌.. స్టార్ ఆట‌గాడిపై స‌స్పెప్ష‌న్.. వ‌చ్చే ఏడాది తొలి మ్యాచ్‌కు దూరం..

స‌త్విక్ దేశ్వాల్‌..
దేశవాళీలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన లెగ్ స్పిన్న‌ర్ స‌త్విక్ దేశ్వాల్‌ను 30 లక్ష‌ల‌కు కొనుగోలు చేసింది. కూర్పు కార‌ణంగా అత‌డికి తుది జ‌ట్టులో చోటు రాలేదు.

విహాన్ మ‌ల్హోత్రా..
భార‌త అండ‌ర్‌-19 జ‌ట్టుకు చెందిన విహాన్ మ‌ల్హోత్రాను 30ల‌క్ష‌ల‌కు ద‌క్కించుకుంది. అయితే.. ఆల్‌రౌండర్‌కు ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసే అవ‌కాశం రాలేదు.

క‌విష్క్ చౌహాన్‌..
యువ ఆల్‌రౌండ‌ర్ క‌నిష్క్ చౌహాన్‌ను 30ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింది. అయితే.. ఇత‌డికి ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవ‌కాశం రాలేదు.