England squad : భార‌త్‌తో టెస్టు సిరీస్‌కు ఇంగ్లాండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. ముగ్గురు కొత్త ముఖాల‌కు చోటు

England squad for India Test series : కొత్త సంవ‌త్స‌రం ప్రారంభంలో ఇంగ్లాండ్ జ‌ట్టు భార‌త ప‌ర్య‌ట‌న‌కు రానుంది.

England squad for India Test series

కొత్త సంవ‌త్స‌రం ప్రారంభంలో ఇంగ్లాండ్ జ‌ట్టు భార‌త ప‌ర్య‌ట‌న‌కు రానుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఇంగ్లాండ్ జ‌ట్టు టీమ్ఇండియాతో 5 మ్యాచుల టెస్టు సిరీస్‌ను ఆడ‌నుంది. జ‌న‌వ‌రి 25 నుంచి మార్చి 11 వ‌ర‌కు ఈ సిరీస్ జ‌ర‌గ‌నుంది. ఈ సిరీస్ కోసం సోమ‌వారం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) జ‌ట్టును ప్ర‌క‌టించింది. 16 మందికి చోటు ఇచ్చింది. మోకాలికి శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్న బెన్‌స్టోక్స్ ప్ర‌స్తుతం కోలుకుంటుండ‌గా అత‌డి సార‌థ్యంలోనే ఇంగ్లాండ్ జ‌ట్టు ఆడ‌నుంది.

కాగా.. జ‌ట్టులో ముగ్గురు కొత్త వారికి చోటు ఇచ్చారు. గస్‌ అట్కిన్సన్‌, టామ్‌ హార్ట్లీ, షోయబ్‌ బషీర్ లు తొలి సారి టెస్టు జ‌ట్టుకు ఎంపిక అయ్యారు. వీరిలో గస్‌ అట్కిన్సన్‌ పేసర్ కాగా.. మిగిలిన ఇద్ద‌రు ఆఫ్ స్పిన్న‌ర్లు. క్రిస్ వోక్స్, విల్ జాక్స్, డాన్ లారెన్స్, లియామ్ డాసన్ ల‌కు జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. భార‌త పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయ‌నే అంచ‌నాల మ‌ధ్య ఇంగ్లాండ్ జ‌ట్టు 4 స్పిన్న‌ర్లును చేర్చుకుంది. గాయం నుంచి కోలుకున్న జాక్ లీచ్ భార‌త్‌తో సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు.

Sunil Gavaskar : ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు పై సునీల్ గ‌వాస్క‌ర్ ఆగ్ర‌హం.. బీసీసీఐ వ‌ద్ద ఉన్న డ‌బ్బు ఉండ‌క‌పోవ‌చ్చు గానీ..

భారత్‌తో సిరీస్‌కు ఇంగ్లాండ్‌ జట్టు ఇదే.. బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఆండర్సన్, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్(వికెట్ కీప‌ర్‌), టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఓలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్

షెడ్యూల్ ఇదే..

మొద‌టి టెస్ట్ – జనవరి 25 నుంచి 29 వ‌ర‌కు – వేదిక హైదరాబాద్‌
రెండో టెస్ట్ – ఫిబ్రవరి 2 నుంచి 6 వ‌ర‌కు – వేదిక వైజాగ్‌
మూడో టెస్ట్ – ఫిబ్రవరి 15 నుంచి19 వ‌ర‌కు – వేదిక రాజ్‌కోట్‌
నాలుగో టెస్ట్ – ఫిబ్రవరి 23 నుంచి 27 వ‌ర‌కు – వేదిక రాంచీ
ఐదో టెస్ట్ – మార్చి 7 నుంచి 11వ‌ర‌కు – వేదిక ధర్మశాల

New Rule in Cricket : అల‌ర్ట్‌.. రేప‌టి నుంచే క్రికెట్‌లో కొత్త రూల్‌.. బౌల‌ర్ల‌కు క‌ష్ట‌కాల‌మే..!

ట్రెండింగ్ వార్తలు