Tilak Varma 2nd County century in 4 innings
సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో ఏర్పడిన ఖాళీ స్థానాల్లో చోటు దక్కించుకునేందుకు హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఇప్పటికే టీ20ల్లో రెగ్యులర్ జట్టు సభ్యుడైన తిలక్.. మిగిలిన ఫార్మాట్‌ల్లోనూ తనదైన ముద్ర వేయాలని చూస్తున్నాడు.
ఓ వైపు భారత జట్టు ఇంగ్లాండ్‌తో ఇంగ్లాండ్ గడ్డ పై ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. మరోవైపు ఇంగ్లాండ్ గడ్డ పైనే జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో తిలక్ వర్మ దుమ్ములేపుతున్నాడు. హాంప్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న తిలక్ వర్మ కేవలం నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనే రెండు సెంచరీలు బాదాడు.
తన కౌంటీ అరంగ్రేటం మ్యాచ్‌లోనే సెంచరీ చేశాడు. ఆ తరువాత రెండో మ్యాచ్‌లో వరుసగా 56, 47 పరుగులు చేశాడు. ఇక ఇప్పుడు మూడో మ్యాచ్ నాటింగ్ హామ్ షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ శతకంతో దుమ్ములేపాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన తిలక్ 256 బంతులు ఎదుర్కొన్నాడు. 13 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేశాడు.
రెడ్ బాల్ క్రికెట్‌లో తిలక్ వర్మ ఇదే ఫామ్ కొనసాగిస్తే అతడు అతి త్వరలోనే భారత టెస్టు జట్టులోకి వచ్చేఅవకాశం ఉంది. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ అద్భుతమైన రికార్డు తిలక్ సొంతం. 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్ఓ 52.11 సగటుతో 1407 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.