Tilak Varma : వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌.. తెలుగు తేజం తిల‌క్ వ‌ర్మ‌ను ఊరిస్తున్న రికార్డు ఇదే..

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు తెలుగు తేజం తిల‌క్ వ‌ర్మ‌ను (Tilak Varma) ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

Tilak Varma Needs 13 More Sixes To Complete 100 Sixes In International T20is

Tilak Varma : భార‌త్, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య నేటి (అక్టోబ‌ర్ 6) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. మొద‌టి టీ20 మ్యాచ్‌కు ల‌క్నోలోని ఎకానా స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. అయితే.. ఈ సిరీస్‌కు ముందు టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు, తెలుగు తేజం తిల‌క్ వ‌ర్మ‌ను ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది. ఈ సిరీస్‌లో తిల‌క్ వ‌ర్మ 13 సిక్స‌ర్లు కొడితే అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 సిక్స‌ర్ల మైలురాయిని చేరుకుంటాడు.

తిల‌క్ వ‌ర్మ ఇప్ప‌టి వ‌ర‌కు 65 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 44.1 స‌గ‌టుతో 1719 ప‌రుగులు సాధించాడు. ఇందులో రెండు శ‌త‌కాలు, 10 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. 131 ఫోర్లు, 87 సిక్స‌ర్లు బాదాడు.

Sanju Samson : వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌.. సంజూ శాంస‌న్‌ను ఊరిస్తున్న అరుదైన మైలురాయి..

ఇక అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో భార‌త్ త‌రుపున ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 5 గురు ఆట‌గాళ్లు మాత్ర‌మే 100 సిక్స‌ర్ల మైలురాయిని చేరుకున్నారు. రోహిత్ శ‌ర్మ‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, అభిషేక్ శ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీలు మాత్ర‌మే టీ20ల్లో 100 సిక్స‌ర్లు బాదారు.

ఇదిలా ఉంటే.. ఈ మైలురాయిని చేరుకోవ‌డానికి సంజూశాంస‌న్‌కు మ‌రో 6 సిక్స‌ర్లు అస‌వ‌రం. దీంతో సంజూ శాంస‌న్‌, తిల‌క్ వ‌ర్మ‌ల‌లో ఎవ‌రు ముందుగా 100 సిక్స‌ర్లు మెలురాయిని చేరుకుంటారోన‌ని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఓపెన‌ర్ అయిన సంజూకే ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయి. అదే స‌మ‌యంలో సూప‌ర్ ఫామ్‌లో ఉన్న తిల‌క్‌ను త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీలులేదు.

IND vs WI : భార‌త్ వ‌ర్సెస్ వెస్టిండీస్ టీ20 సిరీస్‌.. సోనీలో రాదు.. ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన భార‌త ఆట‌గాళ్లు వీరే..

* రోహిత్ శ‌ర్మ – 159 మ్యాచ్‌ల్లో 205 సిక్స‌ర్లు
* సూర్య‌కుమార్ యాద‌వ్ – 113 మ్యాచ్‌ల్లో 179 సిక్స‌ర్లు
* అభిషేక్ శ‌ర్మ – 62 మ్యాచ్‌ల్లో 134 సిక్స‌ర్లు
* హార్దిక్ పాండ్యా – 138 మ్యాచ్‌ల్లో 126 సిక్స‌ర్లు
* విరాట్ కోహ్లీ – 125 మ్యాచ్‌ల్లో 124 సిక్స‌ర్లు
* కేఎల్ రాహుల్ – 72 మ్యాచ్‌ల్లో 99 సిక్స‌ర్లు
* సంజూ శాంస‌న్ – 72 మ్యాచ్‌ల్లో 94 సిక్స‌ర్లు
* తిల‌క్ వ‌ర్మ – 65 మ్యాచ్‌ల్లో 87 సిక్స‌ర్లు