Tilak Varma needs 4 runs to become 1st Indian to achieve this feat vs South Africa
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు తిలక్ వర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో గనుక తిలక్ నాలుగు పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికా పై 500 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.
ఇప్పటి వరకు తిలక్ వర్మ దక్షిణాఫ్రికాపై 10 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 70.85 సగటు 163.15 స్ట్రైక్‌రేటుతో 496 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక ఓవరాల్‌గా దక్షిణాఫ్రికా పై అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా తిలక్ కొనసాగుతున్నాడు. జోస్ బట్లర్, బాబర్ ఆజామ్, జానీ బెయిర్ స్టోలు ఈ జాబితాలో తిలక్ కన్నా ముందు ఉన్నారు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికా పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
* జోస్ బట్లర్ (ఇంగ్లాండ్) – 21 ఇన్నింగ్స్‌ల్లో 606 పరుగులు
* బాబర్ ఆజామ్ (పాకిస్థాన్) – 16 ఇన్నింగ్స్‌ల్లో 526 పరుగులు
* జానీ బెయిర్ స్టో (ఇంగ్లాండ్) – 14 ఇన్నింగ్స్‌ల్లో 501 పరుగులు
* తిలక్ వర్మ (భారత్) – 10 ఇన్నింగ్స్‌ల్లో 496 పరుగులు