×
Ad

Tilak Verma : పాక్‌పై మ్యాచ్ గెలిచాక.. నారా లోకేశ్‌కు తిలక్ వర్మ బహుమతి.. తమ్ముడూ అంటూ లోకేశ్ ట్వీట్.. వీడియో వైరల్

Lokesh Nara Tilak Varma : పాకిస్థాన్ పై మ్యాచ్ గెలిచిన తరువాత తిలక్ వర్మ ఏపీ మంత్రి నారా లోకేశ్ ఓ బహుమతి ఇచ్చారు.

Lokesh Nara Tilak Varma

Tilak Verma Gift to Nara Lokesh: ఆసియాక‌ప్ 2025 విజేత‌గా టీమిండియా నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ ఐదు వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. ఈ విజయంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కీలక భూమిక పోషించాడు. చివరి వరకు క్రీజులో ఉండి ఇండియాను విజయతీరాలకు చేర్చాడు. అయితే, పాకిస్థాన్‌పై మ్యాచ్ గెలిచిన తరువాత తిలక్ వర్మ ఏపీ మంత్రి నారా లోకేశ్ ఓ బహుమతి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Also Read: Asia Cup Final : తిలక్ వర్మ భారీ సిక్స్.. గౌతమ్ గంభీర్ రియాక్షన్ చూశారా.. వావ్.. వీడియో వైరల్..

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవ‌ర్ల‌లో 146 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. భార‌త బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్ నాలుగు వికెట్లు తీశాడు. బుమ్రా, వ‌రుణ్ చ‌క్రవ‌ర్తి, అక్ష‌ర్ ప‌టేల్‌లు త‌లా రెండు వికెట్లు తీశారు. ఆ తరువాత 147 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ 19.4 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. భార‌త బ్యాట‌ర్ల‌లో తిల‌క్ వ‌ర్మ (69; 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ బాదాడు. టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించాడు.

పాకిస్థాన్ జట్టుపై విజయం తరువాత తిలక్ వర్మ మంత్రి నారా లోకేశ్‌కు బహుమతి ఇచ్చాడు. లోకేశ్ అన్నా.. నీకో బహుమతి.. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో తాను ఉపయోగించిన క్యాప్‌ను లోకేశ్‌కు ప్రేమతో ఇస్తున్నట్లు తిలక్‌వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. తిలక్ వర్మ బహుమతికి మంత్రి లోకేశ్ ముగ్ధుడయ్యారు. ఈమేరకు ‘ఎక్స్’లో తిలక్ వర్మ వీడియోను లోకేశ్ పోస్టు చేశారు.

తమ్ముడు తిలక్ వర్మ బహుమతి నాకెంతో ప్రత్యేకమైంది. స్వదేశానికి తిరిగి వచ్చాక అతని చేతుల మీదనే ఈ క్యాప్ తీసుకుంటా అంటూ లోకేశ్ పేర్కొన్నారు.