India vs Sri Lanka 1st T20: నేడు శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్.. హార్దిక్ సారథ్యంలో బరిలోకి భారత్..

భారత్ - శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ ఈ రోజు రాత్రి 7గంటలకు ప్రారంభమవుతుంది. భారత్ - శ్రీలంక జట్లు ఆసియా కప్-2022లో చివరిసారిగా తలపడ్డాయి. ఇందులో టీమిండియా ఓటమిని చవిచూసింది. ఈ రోజు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో విజయంతో 2023 సంవత్సరాన్ని విజయంతో ప్రారంభించాలని ఇరు జట్ల ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు.

India vs Sri Lanka Match

India vs Sri Lanka 1st T20: 2023 సంవత్సరంలో టీమిండియా తన తొలిమ్యాచ్‌ను నేడు ఆడనుంది. భారత్ – శ్రీలంక మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ దూరం కావటంతో హార్దిక్ పాండ్యా సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది. 2023 సంవత్సరంలో ఆడే తొలి సిరీస్ కావటంతో విజయంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలని టీమిండియా ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. ఎక్కువగా యువరక్తంతో కూడిన జట్టు కావటంతో యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ ఓ పరీక్షలా మారనుంది.

IND Vs SL 2023: టీమిండియాతో టీ20, వన్డే సరీస్‌లకు జట్టును ప్రకటించిన శ్రీలంక

భారత్ – శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ ఈ రోజు రాత్రి 7గంటలకు ప్రారంభమవుతుంది. భారత్ – శ్రీలంక జట్లు ఆసియా కప్-2022లో చివరిసారిగా తలపడ్డాయి. ఇందులో టీమిండియా ఓటమిని చవిచూసింది. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్‌లు క్రిజ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. రితురాజ్ గైక్వాడ్ కూడా జట్టు లో ఉన్నాడు. అయితే, అతను తుదిజట్టులో చోటుదక్కించుకొనే అవకాశాలు తక్కవనే చెప్పొచ్చు. ఆతరువాత సంజూ శాంసన్, మూడో స్థానంలో రాహుల్ త్రిపాఠి క్రిజ్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక, పరుగుల వీరుడుగా పేరుగడించిన వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాల్గో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉంది. సెకండ్ బ్యాటింగ్ భారత్‌ది అయితే పరిస్థితిని బట్టి ఫస్ట్ డౌన్‌లోనే సూర్యకుమార్ క్రిజ్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Team India: జనవరిలో టీమిండియా ఎన్ని టీ20, వన్డే మ్యాచ్‌లు ఆడుతుందో తెలుసా? షెడ్యూల్ ఇలా..

ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక, అర్ష్‌దీప్ సింగ్‌లు తుది జట్టులో ఆడే అవకాశాలు ఉన్నాయి. స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇక శ్రీలంక జట్టు దసున్ షనక సారథ్యంలో బరిలోకి దిగనుంది. 2023 సంవత్సరంలో ఆడే తొలి మ్యాచ్లో విజయం సాధించాలని శ్రీలంక ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు.

 

తుదిజట్టు ఇలా ఉండొచ్చు..

భారత్: ఇసాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, సంజుశాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), వాషిగ్టన్ సుందర్, హర్షల్ పటేల్, యుజువేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్.

శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), భానుక రాజపక్సే, ధనంజయ్ డిసిల్వా, చరిత్ అస్లంక, దసున్ షనక్ (కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహిష్ తీక్షణ, లహిరు కుమార, ప్రమోద్ మదుషన్.