India vs Srilanka 2nd ODI: జోరు కొనసాగేనా..? నేడు ఇండియా వర్సెస్ శ్రీలంక రెండో వన్డే

ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ ఇవాళ జరుగుతుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఎనిమిదేళ్ల క్రితం ఇండియా, శ్రీలంక జట్లు చివరిసారి ఈడెన్ గార్డెన్స్‌లో తలపడ్డాయి. రోహిత్ ప్రపంచ రికార్డు స్కోరు (264) సాధించాడు. ఈ సారికూడా రోహిత్‌పై భారీ అంచనాలే ఉన్నాయి.

India vs Srilanka 2nd ODI: ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఇవాళ జరగనుంది. కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లోనూ భారీ విజయాన్ని సాధించి వన్డే సిరీస్‌ను తన ఖతాలో వేసుకొనేందుకు సిద్ధమైంది. తొలిమ్యాచ్ లో కీలక బ్యాట్స్‌మెన్ అందరూ ఫామ్‌ను ఉండటం భారత్ కు కలిసొచ్చే ప్రధాన అంశం.

India vs Sri Lanka: ముగిసిన భారత ఇన్నింగ్స్.. సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ.. శ్రీలంక లక్ష్యం 374 పరుగులు

ఎనిమిదేళ్ల క్రితం ఇండియా, శ్రీలంక జట్లు చివరిసారి ఈడెన్ గార్డెన్స్‌లో తలపడ్డాయి. రోహిత్ ప్రపంచ రికార్డు స్కోరు (264) సాధించాడు. ఈ సారికూడా రోహిత్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. చివరిసారిగా 2020 జనవరిలో వన్డేల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించిన రోహిత్.. చాలాకాలం తరువాత ఈడెన్‌లో సెంచరీ చేస్తాడో లేదో వేచి చూడాల్సిందే. తొలి వన్డే జట్టునే ఎలాంటి మార్పులు లేకుండా రెండో వన్డేలో ఆడే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ను తీసుకోవాలని కొందరు మాజీ క్రికెటర్లు సూచిస్తున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్న అంశం ఆసక్తికరంగా మారింది.

 

టీమిండియాపై తొలి వన్డేలో ఘోర పరాభవాన్ని చవిచూసిన శ్రీలంక.. రెండో వన్డేలో గెలిచి సిరీస్ ను సమం చేయాలన్న పట్టుదలతో ఉంది. కెప్టెన్ శానక బ్యాటింగ్ ఒక్కటే ఆ జట్టుకు ఊరట. సెంచరీతో తొలి వన్డేలో ఆకట్టుకున్న అతను ఫామ్ ను కొనసాగించాలని లంక కోరుకుంటోంది. తొలివన్డేలో ఫీల్డింగ్ లో లంక ఆటగాళ్లు విఫలమయ్యారు. కోహ్లీ క్యాచ్ ను రెండుసార్లు వదిలేయడంతో పాటు బౌండరీల వద్ద పలుసార్లు బాల్‌ను అడ్డుకోవటంలో విఫలమయ్యారు. రెండో వన్డేలోనూ ఇదే పరిస్థితి ఉంటే టీమిండియా సిరీస్ గెలుచుకోవటం ఖాయమే. ఈ డెన్ గార్డెన్స్ లో చివరిసారి వన్డే మ్యాచ్ జరిగి ఐదేళ్లు అవుతుంది. చివరగా ఇక్కడ జరిగిన మ్యాచ్ లో భారత్ 252 పరుగులకు ఆలౌట్ కాగా ఆసిస్ 202 పరుగులే చేసింది.

ట్రెండింగ్ వార్తలు