India vs Australia T20 Match: నేడే ఇండియా – ఆస్ట్రేలియా చివరి టీ20 మ్యాచ్ .. నిర్ణయాత్మక పోరుకు సిద్ధమైన ఉప్పల్ స్టేడియం .. ప్రత్యేకతలు ఏమిటంటే?

ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుకు వేదికకానుంది.

India vs Australia T20 Match: ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుకు వేదికకానుంది. సిరీస్‌లో జరిగిన రెండు మ్యాచ్‌లలో చెరొకటి విజయం సాధించి సమఉజ్జీలుగా ఉన్నాయి. సిరీస్‌ను నిర్ణయించే మ్యాచ్ నేడు ఉప్పల్ స్టేడియంలో జరగనుండి.

India-Australia Teams Reach Hyderabad: హైదరాబాద్ చేరుకున్న భారత్, ఆస్ట్రేలియా జట్లు

ఉప్పల్ స్టేడియంలో చివరిగా 2019డిసెంబర్ 6న మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో పరుగుల వరద పారింది. ఆ టీ20 మ్యాచ్ లో మొదట వెస్టిండీస్ 207 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 209 పరుగులు చేసి విజయం సాధించింది. ఆ తర్వాత ఇదే తొలి మ్యాచ్ కావటం విశేషం. ఈసారి కూడా పిచ్ బ్యాటింగ్ కే ఎక్కువగా సహకరించే అవకాశముంది. పిచ్ పై గడ్డి కనిపించడం లేదు. టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువ.

ఉప్పల్ స్టేడియంలో ఇది మూడో అంతర్జాతీయ టీ20 మ్యాచ్. 2017లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 2019లో వెస్టిండీస్ పై 6వికెట్ల తేడాతో టీమ్ ఇండియా గెలిచింది.

ఈ ఏడాదిలో అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా పాకిస్థాన్ రికార్డును భారత్ సమం చేసింది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో భారత్ జట్టు నెగ్గితే 21 విజయాలతో చరిత్ర సృష్టిస్తుంది. గతేడాది పాకిస్థాన్ 20 మ్యాచ్‌లలో గెలిచింది.

మ్యాచ్ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాత్రి 7గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే 4.30 గంటల నుంచే టికెట్లు కలిగియున్న వారిని స్టేడియంలో లోపలికి అనుమతించనున్నారు.

వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మ్యాచ్ సందర్భంగా మెట్రో రైళ్ల నిర్వహణ సమయాన్ని పెంచారు. రాత్రి 1గంట వరకు మెట్రో రైళ్లు తిరుగుతాయి.

ట్రెండింగ్ వార్తలు