India vs Srilanka T20 Match: సిరీస్ ఎవరిదో తేలేది నేడే.. ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య నిర్ణయాత్మక మ్యాచ్..

ఈ రోజు జరిగే మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఒకవేళ మార్పులు జరిగితే బౌలింగ్ విభాగంలో ఉంటుంది. అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో హర్షల్ పటేల్‌ను తుదిజట్టులోకి తీసుకోనే అవకాశం ఉంది. అయితే ప్రధాన కోచ్ ద్రవిడ్ ఇప్పటికే జట్టులో మార్పులు చేయబోమని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో టాస్ కీలకంగా మారుతుంది.

India vs Srilanka T20 Match: ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య నేడు మూడో టీ20 మ్యాచ్ జరుగుతుంది. టీ20 సిరీస్ ఎవరిదో తేల్చే నిర్ణయాత్మక మ్యాచ్ రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రాత్రి 7గంటలకు ప్రారంభమవుతుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఇరుజట్లు చెరో మ్యాచ్‌లో విజయం సాధించింది సమఉజ్జీలుగా ఉన్నాయి. నేడు జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

India vs Srilanka 1st T20 Match: ఉత్కంఠ పోరులో శ్రీలంక జట్టుపై టీమిండియా విజయం (ఫొటో గ్యాలరీ)

యువరక్తంతో కూడిన భారత్ జట్టు కెప్టెన్ హార్ధిక్ పటేల్ సారథ్యంలో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు శ్రీలంక జట్టు కూడా భారత గడ్డపై తొలిసారిగా టీ20 సిరీస్‌ను గెలుచుకోవాలని భావిస్తోంది. దీంతో నేడు జరిగే మ్యాచ్ ఉత్కంఠభరింగా సాగే అవకాశం ఉంది. రాజ్‌కోట్ పిచ్ ఎప్పుడూ బ్యాటింగ్‌కే అనుకూలంగా ఉంటుంది. దీంతో శనివారం జరిగే మ్యాచ్‌లో భారీ స్కోరు నమోదు కావటం ఖాయంగా కనిపిస్తోంది. టాస్ నెగ్గిన జట్టు ఛేదనకు మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

T20 Match Sri Lanka Win : రెండో టీ20 మ్యాచ్ లో భారత్ పై శ్రీలంక గెలుపు

కొత్త కెప్టెన్ హార్దిక్ నాయకత్వంలో ఎక్కువగా కుర్రాళ్లతో నిండి జట్టు శ్రీలంకతో తలపడుతుంది. జరిగిన రెండుమ్యాచ్ లలో కుర్రాళ్లు తడబాటుకు గురయ్యారు. తొలి మ్యాచ్‌లో యువ భారత్ ఆట ఆకట్టుకోలేక పోయింది. చివరి ఓవర్లో అతికష్టమీద విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో బౌలింగ్ పూర్తిగా అదుపు తప్పింది.ఒకదశ దాటిన తరువాత బౌలింగ్ పూర్తిగా అదుపు తప్పింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు రెండు సార్లు చేతులెత్తేశారు. అయితే వన్డే సిరీస్ ముంగిట ఇరు జట్లకు ఈ టీ20 సిరీస్ కైవసం చేసుకోవటం చాలా అవసరం. మరోవైపు లంక జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తాచాటుతుంది. తొలి మ్యాచ్‌లో చివరి ఓవర్లో ఆ జట్టు ఓడిపోయినప్పటికీ ఆటగాళ్లు మంచి ప్రదర్శనను కనబర్చారు. రెండో మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో లంక జట్టు విజయాన్ని దక్కించుకుంది. మూడో మ్యాచ్‌లో సునాయాసంగా విజయం సాధిస్తామనే ధీమాతో ఆ జట్టు ఆటగాళ్లు ఉన్నారు.

 

ఇదిలాఉంటే ఈ రోజు జరిగే మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఒకవేళ మార్పులు జరిగితే బౌలింగ్ విభాగంలో ఉంటుంది. అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో హర్షల్ పటేల్‌ను తుదిజట్టులోకి తీసుకోనే అవకాశం ఉంది. అయితే ప్రధాన కోచ్ ద్రవిడ్ ఇప్పటికే జట్టులో మార్పులు చేయబోమని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో టాస్ కీలకంగా మారుతుంది. మరి.. నేడు జరిగే నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు