T20 Match Sri Lanka Win : రెండో టీ20 మ్యాచ్ లో భారత్ పై శ్రీలంక గెలుపు
పూణెలో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడింది. భారత్ పై శ్రీలంక 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్ధేంచిన 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.

SRI LANKA
T20 Match Sri Lanka Win : పూణెలో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడింది. భారత్ పై శ్రీలంక 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్ధేంచిన 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ అర్ధ శతకాలతో రాణించినా జట్టును విజయ తీరాలకు మాత్రం చేర్చలేకపోయారు.
ఈ విజయంతో మూడు టీ20 మ్యాచ్ ల సీరిస్ ను 1-1తో శ్రీలంక సమం చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసింది. ఇండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
ICC Awards: సూర్యకుమార్ యాదవ్ మరో ఘనత.. ఐసీసీ టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్
ఓపెనర్ మెండిస్ ఆఫ్ సెంచరీ చేయగా, అసలంక 19 బంతుల్లోనే 37 పరుగులతో రాణించారు. చివర్లో కెప్టెన్ శనక ఆకాశమే హద్దుగా చెలరేగి 20 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేయడంతో స్కోర్ 200 దాటింది. శనివారం మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. రాజ్ కోట్ లో నిర్ణయాత్మక టీ20 మ్యాచ్ జరుగనుంది.
శ్రీలంక బ్యాటింగ్ : శనక 56, మెండిస్ 52, అసలంక 37, నిస్సాంక 33. భారత్ బౌలింగ్ : మాలిక్ 3, అక్షర్ 2, చాహల్ కు ఒక వికెట్. భారత్ బ్యాటింగ్ : అక్షర్ 65, సూర్యకుమార్ 51, శివమ్ మావి 26. శ్రీలంక బౌలింగ్ : దిల్షాన్, రజిత, శనకకు రెండేసి వికెట్లు. కరుణరత్నె, హసనరంగకు ఒక్కో వికెట్ తీశారు.