ICC Awards: సూర్యకుమార్ యాదవ్ మరో ఘనత.. ఐసీసీ టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్

భారత్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది 31 మ్యాచ్‌లు ఆడిన సూర్య.. 187.43 స్ట్రైక్‌రేట్‌తో 1164 పరుగులు చేశాడు.

ICC Awards: సూర్యకుమార్ యాదవ్ మరో ఘనత.. ఐసీసీ టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్

Surya Kumar Yadav

ICC Awards: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీఐ) గురువారం పురుషుల టీ20 క్రికెట్ ఆప్ ది ఇయర్-2022 కోసం నామినీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఇండియా స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ఎంపికయ్యారు. భారత్ నుంచి నామినీ జాబితాలో చేరిన ఏకైక బ్యాటర్ సూర్యకుమార్. పొట్టి ఫార్మాట్‌లో ఈ ఏడాది తన అద్భుతమైన ఆటతీరును సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శించారు. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ తో పాటు మరో ముగ్గురు ఉన్నారు.

ICC Awards

ICC Awards

శ్రీలంకతో స్వదేశంలో జరిగే టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్‌కు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన విషయం విధితమే. ప్రస్తుతం ఆ ఆనందంలోఉన్న సూర్యాకు తాజా వార్త అదనపు సంతోషాన్ని తెచ్చిపెట్టింది. సూర్యకుమార్‌తో పాటు జింబాబ్వే స్టార్ ఆల్ రౌండర్ సికందర్ రజా, ఇంగ్లాండ్ సంచలనం శామ్ కుర్రాన్, పాకిస్థాన్ వికెట్ కీపర్, బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌లు నామినేట్ జాబితాలు ఉన్నారు.

Suryakumar Yadav: సెంచరీతో చెలరేగిన సూర్య కుమార్.. న్యూజిలాండ్‌పై 65 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం

సూర్యకుమార్ యాదవ్ 2022లో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఒకే ఏడాదిలో టీ20 పార్మాట్‌లో వెయ్యికిపైగా పరుగులు సాధించిన తొలి భారతీయ ఆటగాడు. ప్రపంచ స్థాయిలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది 31 మ్యాచ్‌లు ఆడియన సూర్య.. రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలతో 1,164 పరుగులు చేశాడు. జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా 24 మ్యాచ్‌లు ఆడి 735 పురుగులు చేశాడు. 25 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ శామ్ కుర్రాన్ 19 మ్యాచ్ లు ఆడి 67 పరుగులు చేసి, 25 వికెట్లు పడగొట్టాడు. పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్.. 25 మ్యాచ్‌లలో 996 పరుగులు చేశాడు. ఇందులో 10 అర్థ సెంచరీలు ఉన్నాయి.