Suryakumar Yadav: సెంచరీతో చెలరేగిన సూర్య కుమార్.. న్యూజిలాండ్‌పై 65 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‍లోనూ రాణించింది. బ్యాటింగ్‌లో సూర్య కుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగితే, బౌలింగ్‌లో దీపక్ హుడా 4 వికెట్లు తీశాడు.

Suryakumar Yadav: సెంచరీతో చెలరేగిన సూర్య కుమార్.. న్యూజిలాండ్‌పై 65 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం

Suryakumar Yadav: టీ20 సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఇండియా ఘన విజయం సాధించింది. మౌంట్ మాంగనుయ్ వేదికగా, ఆదివారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 65 పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది. ఇండియా అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‍లోనూ అదరగొట్టింది.

Arvind Kejriwal: ఉచిత విద్యుత్ అడ్డుకునేందుకు బీజేపీ యత్నం.. అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణ

బ్యాటింగ్‌లో సూర్య కుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగితే, బౌలింగ్‌లో దీపక్ హుడా 2.5 ఓవర్లలోనే 4 వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఇండియా ఆదిలోనే ఓపెనర్ రిషబ్ పంత్ (6) వికెట్ కోల్పోయింది. తర్వాత ఇషాన్ కిషాన్ 31 బంతుల్లో 36 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 9 పరుగులకే వెను దిరిగాడు. అయితే, వన్ డౌన్‌గా క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ ఆది నుంచి ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. అతడు 51 బంతుల్లోనే 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సూర్య కుమార్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు ఉండటం విశేషం. తర్వాత హార్ధిక్ పాండ్యా 13 పరుగులు చేసి ఔటయ్యాడు.

Warangal: విద్యార్థినుల మధ్య ఘర్షణ.. మనస్తాపంతో బాలికల ఆత్మహత్యాయత్నం

ఆ తర్వాత వచ్చిన దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ కూడా వరుస బంతుల్లో ఔటయ్యారు. ఈ ముగ్గురినీ ఔట్ చేయడం ద్వారా న్యూజిలాండ్ బౌలర్ సౌధీ హ్యాట్రిక్ సాధించాడు. దీంతో ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. తర్వాత 192 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ప్రారంభంలోనే ఓపెనర్ ఫిన్ అలెన్ వికెట్ కోల్పోయింది. రెండో బంతికే అతడు డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే, డెవాన్ కాన్వే, కెప్టెన్ కేన్ విలియమ్సన్ బాధ్యతాయుతంగా ఆడి స్కోరును ముందుకు నడిపించారు. కానీ, డెవాన్ 22 బంతుల్లో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ (12), డెరైల్ మిచెల్ (10) పరుగులు చేసి ఔటయ్యారు. తర్వాత కేన్ విలియమ్సన్ 61 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయకుండానే వెనుదిరిగారు.

Rajamouli : నా నెక్స్ట్ మూవీ ఇండియానా జోన్స్ లా అడ్వెంచరస్ సినిమా.. ఫుల్ ఖుషీలో మహేష్ ఫ్యాన్స్..

దీంతో న్యూజిలాండ్ 18.5 ఓవర్లకే 126 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత బౌలర్లలో దీపక్ హుడా 2.5 ఓవర్లలోనే 4 వికెట్లు తీయడం గమనార్హం. తర్వాత భువనేశ్వర్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు. దీంతో ఇండియా 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయంతో ఇండియా 1-0 ఆధిక్యంలో ఉంది. మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.