Tokyo Olympics 2020: హాకీలో స్వర్ణం కల చెదిరింది.. సెమీ ఫైనల్స్‌లో భారత్ జట్టు ఓటమి

టోక్యో ఒలింపిక్స్ సెమీ ఫైనల్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచ ఛాంపియన్ బెల్జియం చేతుల్లో ఓడిపోయింది. 41 సంవత్సరాల తరువాత, జట్టు ఫైనల్‌కు చేరుకుంటుందని ఆశగా ఎదరుచూసిన భారత్ ఆశలు గల్లంతయ్యాయి.

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ సెమీ ఫైనల్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచ ఛాంపియన్ బెల్జియం చేతుల్లో ఓడిపోయింది. 41 సంవత్సరాల తరువాత, జట్టు ఫైనల్‌కు చేరుకుంటుందని ఆశగా ఎదరుచూసిన భారత్ ఆశలు గల్లంతయ్యాయి. బెల్జియం 5-2 తేడాతో గెలిచి ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. భారత్ మరియు బెల్జియం మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌ ఆదిలో భారత్, బెల్జియం మధ్య పోటాపోటీ వాతావరణం కనిపించింది. అయితే, చివరి త్రైమాసికంలో హాకీ భారత్ పూర్తిగా చేతులెత్తేసింది.

భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం మ్యాచ్‌ ప్రారంభం కాగా.. టోక్యో ఒలింపిక్స్ పురుషుల హాకీ మ్యాచ్‌లో, ప్రపంచ ఛాంపియన్ బెల్జియం ఆట ప్రారంభంలో బెల్జియం జట్టు ఫస్ట్ గోల్ చేసింది. అయితే సెకండ్‌ క్వార్టర్‌ ముగిసేసరికి 2-2 తేడాతో స్కోర్‌ సమం అయ్యింది. భారత్ తరపున మన్‌దీప్‌, హర్మన్‌ప్రీత్‌ చెరో గోల్‌ కొట్టారు. అయితే, బెల్జియం డిఫెండింగ్‌ గేమ్‌ ఆడడంతో టీమిండియాపై ఒత్తిడి పెరుగింది. ఈ విజయంతో ఫైనల్‌లో బెల్జియం బెర్త్ ఖాయమైంది.

బెల్జియం చేతిలో 5-2 ఓటమి తరువాత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గెలుపు మరియు ఓటమి జీవితంలో ఒక భాగమని అన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల హాకీ జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిందని, తదుపరి మ్యాచ్ మరియు వారి భవిష్యత్తు ప్రయత్నాలకు టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశం తన ఆటగాళ్లను చూసి గర్వపడుతోంది అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు