Tom Curran : మంట‌ను చూసి భ‌య‌ప‌డిన స్టార్ ఆల్‌రౌండ‌ర్‌..! కొద్దిలో మిస్సైంది మామా..!

Tom Curran Scared : ఓ స్టార్ ఆట‌గాడు మంట‌ను చూసి భ‌య‌ప‌డ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

Tom Curran Scared

టీ20 క్రికెట్ మ్యాచ్‌ల‌కు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌రుగుల వ‌ర‌ద పార‌డాన్ని అభిమానులు ఎంతో ఇష్ట‌ప‌డుతుంటారు. ఫ్యాన్స్‌ను మ‌రింత ర‌జింప‌చేయ‌డానికి నిర్వ‌హ‌కులు కూడా బౌండ‌రీలు న‌మోదు అయిన స‌మ‌యంలో బౌండ‌రీ లైన్ బ‌య‌ట మంట‌లు వ‌చ్చేలా ఏర్పాటు చేయ‌డాన్ని చూస్తూనే ఉంటాం. అయితే.. ఓ స్టార్ ఆట‌గాడు మంట‌ను చూసి భ‌య‌ప‌డ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ టామ్ కర‌న్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్‌)లో ఆడుతున్నాడు. సిడ్నీ సిక్స‌ర్‌కు టామ్ క‌ర‌న్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. బీబీఎల్‌లో భాగంగా సోమ‌వారం హోబ‌ర్ట్ హ‌రికేన్స్‌, సిడ్నీ సిక్స‌ర్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. టాస్ గెలిచిన సిడ్నీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో హ‌రికేన్స్ మొద‌ట బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ 14వ ఓవ‌ర్‌ను మోయిసెస్ హెన్రిక్స్ వేశాడు.

Gautam Gambhir : అలా ఎలా ప్ర‌పంచ నంబ‌ర్ 1 బౌల‌ర్‌ను ప‌క్క‌న బెట్టారు..? : గంభీర్‌

రెండో బంతిని బ్యాట‌ర్ కోరే అండ‌ర్స‌న్ షాట్ లాంగ్ ఆన్ దిశ‌గా షాట్ ఆడాడు. బంతిని ఆపేందుకు అక్క‌డ ఫీల్డింగ్ చేస్తున్న టామ్‌క‌ర‌న్ విఫ‌ల య‌త్నం చేశాడు. ఈ క్ర‌మంలో బంతి బౌండ‌రీ లైన్ దాటింది. అత‌డికి ఎదురుగా ఉన్న స్టాండ్స్ నుంచి మంట వ‌చ్చింది. దీంతో ఒక్క‌సారి ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్ భ‌య‌ప‌డ్డాడు.

అదే స‌మ‌యంలో కామెంట్రీ బాక్స్‌లో ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ దీనిపై మాట్లాడుతూ.. అబ్బాయిలు దీన్ని చూడండి. టామ్ క‌ర‌న్‌ను చూడ‌డండి. అత‌డు బౌండ‌రీ వెలుప‌ల బంతిని ఆప‌బోయాడు. సాధ్యం కాలేదు. అయితే.. ఒక్క‌సారిగా మంట‌లు రావ‌డంతో భ‌య‌ప‌డిన‌ట్లుగా ఉన్నాడు అంటూ వ్యాఖ్యానించాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Shubman Gill : ఆక్సిజ‌న్ ఫార్ములాకి గిల్ బ్యాటింగ్‌కి సంబంధం ఏమిటి..? శుభ్‌మ‌న్ పై మీమ్స్ వైర‌ల్‌

ఈ మ్యాచులో టామ్ క‌ర‌న్ మూడు వికెట్ల‌తో రాణించాడు. మొద‌ట బ్యాటింగ్ చేసిన హోబ‌ర్ట్ హ‌రికేన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు న‌ష్ట‌పోయి 135 ప‌రుగులు చేసింది. అనంత‌రం డేనియ‌ల్ హ్యూస్ 60 ప‌రుగుల‌తో రాణించ‌డంతో సిడ్నీ 19.2 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు న‌ష్ట‌పోయి ల‌క్ష్యాన్ని చేరుకుంది.

ట్రెండింగ్ వార్తలు