Tom Moody
Team India Coach: టీ20 ప్రపంచకప్ తర్వాత ఇండియన్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి. అయితే, రవిశాస్త్రి వారసుడిగా తదుపరి కోచ్ కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ డైరెక్టర్ టామ్ మూడీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఐపిఎల్ ప్రస్తుత సీజన్‌లో హైదరాబాద్ జట్టు చెత్తగా ఆడింది. 14 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌లు మాత్రమే గెలిచారు. పాయింట్ల పట్టికలో కూడా చివరి స్థానంలో నిలిచింది.
అయితే, ఇప్పుడు ఆ జట్టుకు కోచ్‌గా ఉన్న టామ్ మూడీని టీమిండియాకు హెడ్ కోచ్‌గా నియమిస్తారనే వార్త క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఇప్పటికే కాబోయే కోచ్‌లుగా అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ పేర్లు తెరమీదకు రాగా.. టామ్ మూడీ పేరు కూడా కోచ్ రేసులోకి వచ్చింది. డేవిడ్ వార్నర్ వంటి స్టార్ ప్లేయర్ల పట్ల కఠినంగా వ్యవహరించి, వారిని తప్పించారని అంటూ ఉంటారు.
యువ ఆటగాళ్లతో జట్టును నింపాలని గట్టిగా వాదించే మూడీ సలహాలు టీమిండియాకు కూడా బాగా పనికొస్తాయని భారత క్రికెట్ నియంత్రణ మండలి భావస్తే గట్టి నిర్ణయమే తీసుకోవచ్చు. టామ్ మూడీ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గతంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టెన్ తదితర విదేశీ కోచ్‌లు టీమిండియాకు శిక్షణ ఇవ్వగా ఇప్పుడు టామ్ మూడీకి కూడా అవకాశం వచ్చేలా కనిపిస్తుంది.