CPL 2023 : అగో.. రెడ్ కార్డు వ‌చ్చింది.. నువ్వు బ‌య‌టికి పో.. పాపం సునీల్ న‌రైన్‌.. పొలార్డ్ ఇలా చేశావేంటి..?

కరీబియన్ ప్రీమియ‌ర్ లీగ్ (CPL) 2023లో పుట్‌బాల్ త‌ర‌హాలో రెడ్ కార్డు నిబంధ‌న‌లు తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి సారి రెడ్ కార్డు కార‌ణంగా బ‌య‌టికి వెళ్లిన ఆట‌గాడిగా వెస్టిండీస్‌కు చెందిన సునీల్ న‌రైన్ నిలిచాడు.

Knight Riders get red card

CPL : కరీబియన్ ప్రీమియ‌ర్ లీగ్ (CPL) 2023లో పుట్‌బాల్ త‌ర‌హాలో రెడ్ కార్డు నిబంధ‌న‌లు తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఫుట్‌బాల్‌లో నిబంధ‌న‌లు ఉల్లంగించిన ఆట‌గాళ్ల‌కు రెడ్ కార్డు చూయిస్తూ బ‌య‌ట‌కు పంపిస్తుంటారు. అయితే.. క్రికెట్‌లో మాత్రం స్లో ఓవ‌ర్ రేటుకు రెడ్ కార్డు ఉప‌యోగిస్తున్నారు. సీపీఎల్ తీసుకువ‌చ్చిన కొత్త నిబంధ‌న ప్ర‌కారం ఇన్నింగ్స్ ఆఖ‌రి మూడు ఓవ‌ర్ల‌ను ప్రారంభ స‌మ‌యం క‌న్నా ఆల‌స్యంగా వేస్తే ఆ జ‌ట్టుకు రెడ్ కార్డు చూపిస్తారు. దీంతో ఆ జ‌ట్టు కెప్టెన్ ఓ ప్లేయ‌ర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అత‌డు ఆఖ‌రి ఓవ‌ర్ కు మైదానంలో ఉండ‌కూడ‌దు. 10 మంది ఆట‌గాళ్ల‌తోనే ఫీల్డింగ్ జ‌ట్టు ఆఖ‌రి ఓవ‌ర్‌ను బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.

ఈ కొత్త నిబంధ‌న వ‌ల్ల‌.. మొద‌టి సారి రెడ్ కార్డు కార‌ణంగా బ‌య‌టికి వెళ్లిన ఆట‌గాడిగా వెస్టిండీస్‌కు చెందిన సునీల్ న‌రైన్ నిలిచాడు. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జ‌ట్టు త‌రుపున న‌రైన్ ఆడుతున్నాడు. సోమ‌వారం సెయింట్ కిట్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో నైట్ రైడ‌ర్స్ నిర్ణీత స‌మ‌యంలో ఓవ‌ర్ల‌ను వేయ‌డంలో విఫ‌ల‌మైంది. దీంతో అంపైర్ ఆఖరి ఓవ‌ర్‌కు ముందు రెడ్ కార్డును చూయించాడు. దీంతో నైట్‌రైడ‌ర్స్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ సూచ‌న మేర‌కు సునీల్ న‌రైన్ గ్రౌండ్ బ‌య‌ట‌కు వెళ్లాడు. ఈ క్ర‌మంలో నైట్‌రైడ‌ర్స్ ఆఖ‌రి ఓవ‌ర్‌లో 10 మందితోనే ఫీల్డింగ్ చేసింది.

Neeraj Chopra: 140 కోట్ల మంది భారతీయులు గర్వపడే మరో పని చేసిన నీరజ్.. మైదానంలో కాదు బయట..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పాట్రియోట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల న‌ష్టానికి 178 పరుగులు చేసింది. నికోలస్ పూరన్(61; 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులు), కీరన్ పొలార్డ్(37 నాటౌట్; 16 బంతుల్లో 5 సిక్స‌ర్లు), ఆండ్రీ రస్సెల్(23 నాటౌట్; 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) దంచికొట్ట‌డంతో ల‌క్ష్యాన్ని నైట్ రైడ‌ర్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్ల కోల్పోయి చేధించింది.

CPL 2023 : మ‌న‌కెందుకు భ‌య్యా.. ఇలాంటి రిస్క్ షాట్లు.. ఏదైన జ‌రిగుంటే..?

ఇక మ్యాచ్ అనంత‌రం రెడ్ కార్డు నిబంధ‌న‌పై నైట్ రైడ‌ర్స్ కెప్టెన్ పొలార్డ్ మాట్లాడాడు. ఈ నిబంధ‌న హ‌స్యాస్పందంగా ఉంద‌ని పేర్కొన్నాడు. ఇలాంటి నిబంధ‌న కార‌ణంగా ఆట‌గాళ్ల మొత్తం కృషి వృథా అవుతుంద‌న్నాడు. ‘మ్యాచ్‌లో మేము అనుకున్న ప్ర‌ణాళిక‌లు విజ‌య‌వంతం అయ్యాయి. వీలైనంత వేగంగా ఆడాల‌ని నిర్ణ‌యించుకున్నాం. అందుకుత‌గ్గ‌ట్లే ఆడాం. ఇలాంటి టోర్న‌మెంట్‌లో 35-40 సెక‌న్ల జ‌రిమానా విధించ‌డం అనేది పూర్తిగా హాస్యాస్ప‌దంగానే ఉంది.’ అని పొలార్డ్ చెప్పాడు.

CPL 2023 : క్రికెట్‌లో కొత్త రూల్స్‌.. స్లో ఓవ‌ర్ రేటుకు భారీ మూల్యం.. రెడ్ కార్డు.. ఐదు ప‌రుగుల కోత ఇంకా..

ట్రెండింగ్ వార్తలు