Sri Lanka : హోటల్‌లో మహిళలు స్నానం చేస్తుండగా.. వీడియోలు తీసిన శ్రీలంక అండర్-19 క్రికెటర్లు.. ఇద్దరి అరెస్టు..
Sri Lanka U 19 Cricketers Arrest: శ్రీలంక క్రికెట్‌లో (Sri Lanka) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
- Thota Vamshi Kumar
- Updated on- May 1, 2026 / 11:30 AM IST
Two Sri Lankan Under 19 cricketers arrested over allegations of filming people bathing in the hotel
- ఇద్దరు శ్రీలంక అండర్-19 క్రికెటర్లను అరెస్టు చేసిన పోలీసులు
- తాము బస చేసిన హోటల్‌లో మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు తీశారని ఆరోపణ
Sri Lanka U-19 Cricketers: శ్రీలంక క్రికెట్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ దేశానికి చెందిన ఇద్దరు అండర్-19 క్రికెటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు తాము బస చేసిన హోటల్‌లో మహిళలు బాత్ రూమ్‌లలో స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియోలు తీశారనే ఆరోపణలను ఆ ఇద్దరు క్రికెటర్లు ఎదుర్కొంటున్నారు.
కొలంబోలోని నరహెన్‌పిటలోని ఓ హోటల్‌లో బస చేస్తున్న కొందరు మహిళలు తాము స్నానం చేస్తున్న సమయంలో రహస్యంగా వీడియో తీశారని లంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ వారం ప్రారంభంలో ఇద్దరు శ్రీలంక అండర్- 19 క్రికెటర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో తెలిపింది.
వారిద్దరు ఆ వీడియోను ఇంకా ఎవరికైనా పంపారా? ఏదైన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేశారా? వంటి వారిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ నిమిత్తం అలుత్కడే మేజిస్ట్రేట్ కోర్టులో వారిద్దరిని పోలీసులు హాజరు పరచగా.. లంక కరెన్సీలో 5 లక్షల వ్యక్తిగత పూచీకత్తు పై మెజిస్ట్రేజ్ వారికి బెయిల్ మంజూరు చేశారు.
ఈ విషయం పై శ్రీలంక క్రికెట్ బోర్డు ఇప్పటి వరకు ఎలాంటి క్రమ శిక్షణా చర్యలు చేపట్టలేదు. అయితే.. గత 48 గంటలుగా బోర్డులో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పాత కార్యవర్గ సభ్యులను తొలగించడం, పరివర్తన కమిటీని ఏర్పాటు చేయడం వంటివి చోటు చేసుకుంటున్నాయి.
*రజత్ పాటిదార్ విషయంలో కోహ్లీకి కోపమొచ్చింది.. అంపైర్‌తో వాదన.. అది ఔట్ కాదయ్యా..
శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి)ను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన పరివర్తన కమిటీలో తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. ఇందులో దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర కూడా ఉన్నాడు.
