U19 Asia Cup 2025 Final Team India target is 348
U19 Asia Cup 2025 : దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 348 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.
Innings Break!
3⃣ wickets for Deepesh Devendran 👌
2⃣ wickets each for Khilan Patel and Henil Patel 👍A 🎯 of 348 for India U19 to clinch the #MensU19AsiaCup2025
Scorecard ▶️ https://t.co/ht0DLU8XQ3 pic.twitter.com/iAMhAfgurX
— BCCI (@BCCI) December 21, 2025
పాక్ బ్యాటర్లలో సమీర్ మిన్హాస్ (172; 113 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ శతకం సాధించాడు. అహ్మద్ హుస్సేన్ (56; 72 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) అర్థశతకం సాధించాడు. ఉస్మాన్ ఖాన్ (35) పర్వాలేదనిపించగా ఫర్హాన్ యూసుఫ్ (19), హంజా జహూర్ (18) లు విఫలం అయ్యారు. టీమ్ఇండియా బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ మూడు వికెట్లు తీశాడు. హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. కాన్షిక్ చౌహాన్ ఓ వికెట్ పడగొట్టాడు.