U19 World Cup 2026 Bangladesh target is 239 against India
U19 World Cup 2026 : అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఓ మోస్తరు స్కోరు సాధించింది. భారత ఇన్నింగ్స్ మధ్యలో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. 48.4 ఓవర్లలో భారత్ 238 పరుగులకు ఆలౌటైంది. దీంతో బంగ్లాదేశ్ ముందు 239 పరుగుల లక్ష్యం నిలిచింది.
టీమ్ఇండియా బ్యాటర్లలో అభిజ్ఞాన్ కుందు (80; 112 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), వైభవ్ సూర్యవంశీ (72; 67 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కాన్షిక్ చౌహాన్ (28) పర్వాలేదనిపించాడు.
Innings Break!
Abhigyan Kundu’s 80 and Vaibhav Sooryavanshi’s 72 guide India U19 to 238 👏
Over to the bowlers now! 👌
Scorecard ▶️ https://t.co/8P6KxkszO5#U19WorldCup pic.twitter.com/yuaSfqtDHR
— BCCI (@BCCI) January 17, 2026
మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో భారత్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ పహాద్ ఐదు వికెట్లు తీశాడు. ఇక్బాల్ హుస్సేన్ ఎమోన్, అజిజుల్ హకిమ్ తమిమ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. షేక్ పర్వేజ్ జిబాన్ ఓ వికెట్ సాధించాడు.