U19 World Cup 2026 final India U19 opt to bat against England
U19 World Cup 2026 : అండర్-19 వన్డే ప్రపంచకప్ 2026లో భాగంగా హరారే వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అండర్-19 ప్రపంచకప్ లో భారత జట్టుకు ఇది పదో పైనల్ కాగా.. ఇప్పటి వరకు టీమ్ఇండియా ఐదు సార్లు విజేతగా నిలిచింది.
‘ముందుగా మేము బ్యాటింగ్ చేస్తాము. ఇది బ్యాటింగ్ పిచ్‌లా కనిపిస్తోంది. భారీ స్కోరు చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాలని భావిస్తున్నాము. ఆఖరి మ్యాచ్‌లో కూడా కుర్రాళ్లు చెలరేగుతారని ఆశిస్తున్నాను. మేము మా సహజ ఆటను ఆడుతాము. తుది జట్టులో ఎలాంటి మార్పు లేదు.’ అని భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే తెలిపాడు.
T20 World Cup 2026 : మరో రోజులో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..
ఇంగ్లాండ్ తుది జట్టు..
బెన్ డాకిన్స్, జోసెఫ్ మూర్స్, బెన్ మేయస్, థామస్ రెవ్ (కెప్టెన్), కాలేబ్ ఫాల్కనర్, రాల్ఫీ ఆల్బర్ట్, ఫర్హాన్ అహ్మద్, సెబాస్టియన్ మోర్గాన్, జేమ్స్ మింటో, మానీ లమ్స్‌డెన్, అలెక్స్ గ్రీన్
🚨 Toss and Playing XI 🚨
India U19 have won the toss and elected to bat against England U19 in the Final of the #U19WorldCup 🙌
Updates ▶️ https://t.co/hisult7mtv pic.twitter.com/0lulw4KRTL
— BCCI (@BCCI) February 6, 2026
భారత తుది జట్టు..
ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే(కెప్టెన్), విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(వికెట్ కీపర్), ఆర్ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్