U19 World Cup 2026 Pakistan U19 vs England U19 Pakistan Batter Ali Raza bizarre manner
U19 World Cup 2026 : అండర్ -19 ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు రనౌట్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని చూసిన నెటిజన్లు మొత్తానికి పాక్ క్రికెటర్ అనిపించుకున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే అతడికి జాతీయ జట్టులో చోటు దక్కడం ఖాయమని అంటున్నారు.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. 46.5 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. ఆ తరువాత 211 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ జట్టు 46.3 ఓవర్లలో 173 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు 37 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Steve Smith : చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. బిగ్‌బాష్ లీగ్‌లో ఒకే ఒక్కడు..
అలీ రజా రనౌట్ వైరల్..
పాక్ చివరి బ్యాట్‌మన్ గా అలీ రజా రనౌట్ గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. కాగా అతడు రనౌట్ అయిన విధానం అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది. పాక్ విజయానికి 38 పరుగులు అవసరం అయిన స్థితిలో మోమిన్ ఖమన్ షాట్ ఆడి సింగిల్ కోసం పరిగెత్తాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న రజా చాలా ఈజీగానే క్రీజు వద్దకు వచ్చాడు. కానీ..
అదే సమయంలో ఫీల్డర్ వికెట్ కీపర్‌కు బంతిని త్రో చేయగా.. దాన్ని అందుకున్న ఇంగ్లాండ్ కీపర్ థామస్ వెంటనే వికెట్లను పడగొట్టాడు. అలీ క్రీజును చేరుకునే ప్రయత్నం చేయగా అప్పటికే ఆలస్యమైంది. దీంతో అతడు రనౌట్ అయ్యాడు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఫీల్డర్ వేసిన త్రో నుంచి తప్పించుకునేందుకు అలీ ఆగినట్లుగా వీడియోలో కనిపిస్తోంది.