Steve Smith : చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. బిగ్‌బాష్ లీగ్‌లో ఒకే ఒక్కడు..
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) అరుదైన ఘనత సాధించాడు.
Steve Smith creates history 4 centuries in BBL history
- శతకంతో చెలరేగిన స్టీవ్ స్మిత్
- బిగ్‌బాష్ లీగ్‌లో నాలుగో సెంచరీ
- ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడు
Steve Smith : ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత సాధించాడు. బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. శుక్రవారం సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్మిత్ కేవలం 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఘనత అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు డేవిడ్ వార్నర్, బెన్ మెక్‌డెర్మాట్ లను అధిగమించాడు. వార్నర్ కూడా ఇదే మ్యాచ్‌లో సెంచరీ చేయడం గమనార్హం.
బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
* స్టీవ్ స్మిత్ – 4 శతకాలు
* డేవిడ్ వార్నర్ – 3 శతకాలు
* బెన్ మెక్‌డెర్మాట్ – 3 శతకాలు
What a player.
Steve Smith has just hit his fourth Big Bash hundred off just 41 balls 🤩 #BBL15 pic.twitter.com/lzT2Fyy7HT
— KFC Big Bash League (@BBL) January 16, 2026
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డేవిడ్ వార్నర్ (110 నాటౌట్; 65 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు)సెంచరీ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సిడ్నీ సిక్సర్స్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్, జాక్ ఎడ్వర్డ్స్, బెన్ మనెంటి లు తలా ఓ వికెట్ తీశారు.
ఆ తరువాత స్టీవ్ స్మిత్ (100; 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లు ) శతక్కొట్టడంతో 190 పరుగుల లక్ష్యాన్ని సిడ్నీ సిక్సర్స్ 17.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. సిడ్నీ బ్యాటర్లలో స్మిత్ కాకుండా బాబర్ ఆజామ్ (47; 39 బంతుల్లో 7 ఫోర్లు) రాణించాడు. సిడ్నీ థండర్ బౌలర్లలో నాథన్ మెక్‌ఆండ్రూ రెండు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ గ్రీన్, ఐదాన్ ఓ కానర్, తన్వీర్ సంఘా లు తలా ఓ వికెట్ తీశారు.
