×
Ad

T20 World Cup 2026: భారత్‌ను ఆదుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌.. లేదంటే..?

అమెరికా బౌలర్లలో షాడ్లీ షాల్క్‌విక్ 4, హర్మీత్‌ సింగ్ 2, అలీ ఖాన్, మోహ్షిన్ తలో వికెట్ తీశారు.

Surya Kumar Yadav (Pic: @BCCI)

  • అమెరికాకు 162 పరుగుల టార్గెట్ ఇచ్చిన భారత్‌
  • భారత బ్యాటర్లలో 84 రన్స్‌ చేసిన సూర్యకుమార్ 
  • మిగతా బ్యాటర్లు విఫలం.. షాల్క్‌విక్‌కు 4 వికెట్లు

T20 World Cup 2026: ఐసీసీ మెన్స్‌ టీ20 ప్రపంచ కప్-2026 3వ మ్యాచ్‌లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 20, అభిషేక్ శర్మ 0, తిలక్ వర్మ 25, సూర్యకుమార్ యాదవ్ 84, శివమ్ దూబే 0, రింకు సింగ్ 6, హార్దిక్ పాండ్యా 5, అక్షర్ పటేల్ 14, అర్ష్‌దీప్ సింగ్ 4, వరుణ్ చక్రవర్తి 0 పరుగులు చేశారు.

Also Read: T20 World Cup 2026 : సిరాజ్‌కు గోల్డెన్ ఛాన్స్‌.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 నుంచి హ‌ర్షిత్ రాణా ఔట్‌..

మిగతా బ్యాటర్లు అందరూ విఫలమవుతున్న వేళ సూర్యకుమార్ యాదవ్ క్రీజులో నిలదొక్కుకుని 84 పరుగులు చేశాడు. లేదంటే భారత్‌ స్కోరు 100 కూడా దాటకపోయేది. అమెరికా బౌలర్లలో షాడ్లీ షాల్క్‌విక్ 4, హర్మీత్‌ సింగ్ 2, అలీ ఖాన్, మోహ్షిన్ తలో వికెట్ తీశారు.