టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా, అమెరికా జట్ల మధ్య ఆసక్తికర పోరు

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా, అమెరికా జట్ల మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. 8 మంది భారతీయ మూలాలు ఉన్న ప్లేయర్లతో అమెరికా టీమ్ జోరు చూపిస్తోంది.

United States vs India first international t20 match interesting facts

IND vs USA: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్దమైంది. గ్రూప్ ఏలో ఉన్న టీమిండియా, అమెరికా జట్టు ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ముఖాముఖి తలపడనున్నాయి. న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇది ఈ రెండు జట్ల జరుగుతున్న తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ కావడం విశేషం. గ్రూప్ ఏలో టాప్ పొజిషన్ కోసం ఇరు టీములు బరిలోకి దిగుతున్నాయి. రెండేసి విజయాలతో గ్రూప్ ఏలో ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. మెరుగైన ర‌న్‌రేటుతో టీమిండియా ముందు ఉంది. ఈరోజు మ్యాచ్‌లో గెలిచిన జట్టు టాప్‌లో ఉంటుంది. అంతకాదు సూపర్ 8లో దూసుకుపోవడానికి ఈ విజయం కీలకమవుతుంది.

టీమిండియా వర్సెస్ మినీ ఇండియా
టీ20 ర్యాంకుల్లో నంబ‌ర్‌వ‌న్‌ స్థానంలో ఉన్న టీమిండియాతో 18వ ర్యాంకులో ఉన్న అమెరికా పోటీ ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై సంచలన విజయం సాధించి యూఎస్ టీమ్ జోరు చూపించింది. కాగా, అమెరికా జాతీయ క్రికెట్ జట్టు మినీ ఇండియాను తలపిస్తోంది. ఎందుకంటే ఈ టీములో 8 మంది భారతీయ మూలాలు ఉన్న ప్లేయర్లు ఉన్నారు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో అమెరికాను గెలిపించిన సౌరభ్ నేత్రావల్కర్‌ అమెరికా జట్టులో కీలకం కానున్నాడు. ఇరు జట్లు కూడా గత మ్యాచుల్లో ఆడిన టీముతోనే బరిలోకి దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.

మీకిది తెలుసా?
అమెరికా జట్టులో ప్రస్తుతం ఉన్న ప్లేయర్లలో ఐదుగురు భారతదేశంలో జన్మించారు. వారు.. మిలింద్ కుమార్, హర్మీత్ సింగ్, రోనక్ పటేల్, సౌరభ్ సౌరభ్ నేత్రావల్కర్‌, నిసర్గ్ పటేల్.

హర్మీత్ సింగ్ ఒక IPL మ్యాచ్ ఆడాడు. రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన హర్మీత్ సింగ్.. తాను ఆడిన ఏకైక IPL మ్యాచ్‌లో రాస్ టేలర్‌ను అవుట్ చేశాడు.

Also Read: బుమ్రా క‌పుల్ ఇంట‌ర్వ్యూ వైర‌ల్‌.. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ క‌లుద్దాం.. ఏదీ 30 నిమిషాల్లోనా..!

భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్

అమెరికా జట్టు: స్టీవెన్ టేలర్, మోనాంక్ పటేల్ (వికెట్ కీపర్/కెప్టెన్), ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్, నితీష్ కుమార్, కోరీ అండర్సన్, హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్, నోస్తుష్ కెంజిగే, సౌరభ్ నేత్రావల్కర్, అలీ ఖాన్, నిసార్గ్ పటేల్, షయాన్ జహంగీర్, మిలింద్ కుమార్, షాడ్లీ వాన్ షాల్క్విక్