UP vs GG Women WPL 2023 : వాటే మ్యాచ్.. గుజరాత్‌పై యూపీ థ్రిల్లింగ్ విక్టరీ, సింగిల్ హ్యాండ్‌తో గెలిపించిన గ్రేస్

విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో యూపీ జట్టు అదరగొట్టింది. గుజరాత్ పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది.(UP vs GG Women WPL 2023)

UP vs GG Women WPL 2023 : విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో యూపీ జట్టు అదరగొట్టింది. గుజరాత్ పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ.. 19.5 ఓవర్లలో టార్గెట్ ను చేజ్ చేసింది.

Also Read..WPL: Delhi vs Bangalore Live Updates: 60 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

మరో బంతి మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. యూపీ జట్టు 19.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. గ్రేస్ హారిస్ హాఫ్ సెంచరీతో చెలరేగింది. 26 బంతుల్లోనే 59 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. సింగిల్ హ్యాండ్ తో జట్టుని గెలిపించింది. ఆమె ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.

టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ 32 బంతుల్లో 7 ఫోర్లతో 46 పరుగులు చేయగా.. ఓపెనర్ సబ్బినేని మేఘన 15 బంతుల్లో 24 పరుగులు, గార్డెనర్ 19 బంతుల్లో 25 పరుగులు, దయాళన్ హేమలత 13 బంతుల్లో 21 పరుగులతో రాణించారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎక్లస్టోన్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అంజలీ సర్వాని, తహ్లియా మెక్ గ్రాత్ తలో ఒక్కో వికెట్ తీశారు.(UP vs GG Women WPL 2023)

Also Read..WPL 2023: అట్టహాసంగా ప్రారంభమైన డబ్ల్యూపీఎల్‌.. తొలి మ్యాచ్‌లో దంచికొట్టిన ముంబయి ..

యూపీ వారియర్స్ జట్టులో.. కిరణ్ నేవ్ గిర్ హాఫ్ సెంచరీతో రాణించింది. 43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు సాధించింది. గ్రేస్ హారిస్ దంచికొట్టింది. 26 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేసి చివరి వరకు క్రీజులో ఉండి జట్టును సింగిల్ హ్యాండ్ తో గెలిపించింది. మరో ఎండ్ లో సోఫియా 12 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్ తో 22 పరుగులు చేసి సహకరించింది. గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ 5 వికెట్లు తీయగా.. అన్నాబెల్ సుదర్లాండ్, మాన్సి జోషీ చెరో వికెట్ పడగొట్టారు.(UP vs GG Women WPL 2023)

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

 

స్కోర్లు..
గుజరాత్ జయింట్స్-20 ఓవర్లలో 169/6
యూపీ వారియర్స్-19.5 ఓవర్లలో 175/7