WPL: Delhi vs Bangalore Live Updates: 60 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల ధాటికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

WPL: Delhi vs Bangalore Live Updates: 60 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

WPL: Delhi vs Bangalore Live Updates

WPL match: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన బెంగళూరు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లకు స్కోరు 223గా నమోదైంది. అనంతరం, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల ధాటికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

నిన్న జరిగిన తొలి మ్యాచులో గుజరాత్ జెయింట్స్ జట్టును ముంబై ఇండియన్స్ జట్టు చిత్తు చేసిన విషయం తెలిసిందే. నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచు ముంబైలో జరుగుతోంది. కాగా, ఇవాళ రాత్రి 7.30 గంటలకు యూపీ, గుజరాత్ జట్లు ఆడనున్నాయి.

IND vs AUS Test Series 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ చేరాలంటే.. శ్రీలంక జట్టు ఓడాల్సిందేనా..

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 05 Mar 2023 06:49 PM (IST)

    60 పరుగుల తేడాతో ఢిల్లీ ఘన విజయం

    ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల ధాటికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. డబ్ల్యూపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

  • 05 Mar 2023 06:21 PM (IST)

    7 వికెట్లు డౌన్

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లక్ష్య ఛేదనలో రాణించలేకపోతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల ధాటికి 13.1 ఓవర్లకే 7 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు స్మృతి మంధాన 35, సోఫీ డివైన్ 14, పెర్రీ 31, దిశా కాసాత్ 9 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద ఔటైన తర్వాత రిచా ఘోష్ 2 పరుగులకే ఔటయ్యారు. ఆ వెంటనే అహుజా 0, శోభనా 2 పరుగులకు వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో హీథర్ నైట్ 4, మెగాన్ 5 పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్కోరు 105/7 (14 ఓవర్లకు)గా ఉంది.

  • 05 Mar 2023 06:09 PM (IST)

    4 వికెట్లు కోల్పోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు స్మృతి మంధాన 35, సోఫీ డివైన్ 14, పెర్రీ 31, దిశా కాసాత్ 9 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో రిచా ఘోష్ 1, హీథర్ నైట్ 1 పరుగుల ఉన్నారు.

  • 05 Mar 2023 05:51 PM (IST)

    2 వికెట్లు కోల్పోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు స్మృతి మంధాన 35, సోఫీ డివైన్ 14 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో పెర్రీ 15, దిశా కాసాత్ 2 పరుగులతో ఉన్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్కోరు 66/2 (8 ఓవర్లకు)గా ఉంది.

  • 05 Mar 2023 05:30 PM (IST)

    3 ఓవర్లలో 31 పరుగులు

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్లు స్మృతి మంధాన, సోఫీ డివైన్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం స్మృతి మంధాన 17, సోఫీ డివైన్ 14 పరుగులతో ఉన్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్కోరు 3 ఓవర్లకు 31గా ఉంది.

  • 05 Mar 2023 05:04 PM (IST)

    ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు.. బెంగళూరు టార్గెట్ 224

    ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించింది. మెగ్ లెనింగ్ 72, షఫాలీ వర్మ 84, మారిజాన్ కాప్ 39 (నాటౌట్), జెమిమా రోడ్రిగ్స్ 22  (నాటౌట్) పరుగులు చేయడంతో ఈ జట్టు స్కోరు నిర్ణీత 20 ఓవర్లకు 223 గా నమోదైంది.

  • 05 Mar 2023 04:57 PM (IST)

    200 దాటిన స్కోరు

    ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 200 దాటింది. ప్రస్తుతం క్రీజులో మారిజాన్ కాప్ 33, జెమిమా రోడ్రిగ్స్ 15 పరుగులతో ఉన్నారు. స్కోరు 211/2 (19 ఓవర్లకు)గా ఉంది.

  • 05 Mar 2023 04:54 PM (IST)

    200 పరుగుల దిశగా ఢిల్లీ క్యాపిటల్స్

    200 పరుగుల దిశగా ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు బోర్డు పరుగులు తీస్తోంది.

  • 05 Mar 2023 04:51 PM (IST)

    అదరగొట్టిన ఓపెనర్లు

    ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు బ్యాటర్లు అదరగొట్టేశారు. మెగ్ లెనింగ్ 72, షఫాలీ వర్మ 84 పరుగులు చేసి ఔటయ్యారు. మారిజాన్ కాప్ 13, జెమిమా రోడ్రిగ్స్ 12 పరుగులతో ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.

  • 05 Mar 2023 04:48 PM (IST)

    జట్ల వివరాలు

    ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో షఫాలీ వర్మ, మెగ్ లెనింగ్ (కెప్టెన్), మారిజాన్ కాప్, జెమిమా రోడ్రిగ్స్, ఆలిస్ క్యాప్, జెస్ జోనాస్సెన్, తానియా భాటియా, అరుంధతి రెడ్డి, శిఖా పాండే, రాధా యాదవ్, తారా నోరిస్ ఉన్నారు.

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో హీథర్ నైట్, ఎల్లీస్ పెర్రీ, సోఫీ డివైన్, మేఘాన్, స్మృతి మంధాన, ప్రీతి బోస్, రేణుకా సింగ్, రిచా ఘోష్, శోభన ఆశ, కనికా అహుజా, దిశా కసత్ ఉన్నారు.