USA Star Aaron Jones Fires Warning To India
United States vs India : టీ20 ప్రపంచకప్ 2024లో ఆతిథ్య అమెరికా జట్టు అదరగొడుతోంది. తొలి మ్యాచ్‌లో కెనడాను చిత్తు చేసిన యూఎస్ఏ రెండో మ్యాచ్‌లో పెను సంచలనం సృష్టించింది. పాకిస్తాన్ జట్టును ఓడించింది. తద్వారా సూపర్ 8కి చేరువైంది. గ్రూపు-ఏలో ఉన్న అమెరికా ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. భారత్‌తో సమాన పాయింట్లు ఉన్నప్పటికి నెట్‌రన్ వ్యత్యాసంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక నేడు (బుధవారం జూన్ 12)న టీమ్ఇండియాతో పోరుకు సిద్ధమైంది.
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్-8 కి చేరుకుంటుంది. ఈ క్రమంలో అమెరికా జట్టు స్టార్ ప్లేయర్ ఆరోన్ జోన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రత్యర్థి ఎవరైనా సరే తాము నిర్భయంగా ఆడతామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి అగ్రస్థానంలో నిలవాలని భావిస్తున్నామని చెప్పాడు. ప్రతి మ్యాచ్‌లో విజయం కోసం కష్టపడి ఆడుతామని చెప్పాడు. ఇక భారత్‌కు చాలా గట్టి పోటీనిస్తాం అని జోన్స్ అన్నాడు.
Ambati Rayudu : సీఎంగా పవన్ కళ్యాణ్‌ను చూడాలనేది నా కల.. ఇంకో అడుగు దూరమే : అంబటి రాయుడు
గత రెండు వారాలుగా కఠిన శిక్షణ పొందుతున్నామని, జట్టుగా చాలా బాగా ఆడుతున్నట్లు చెప్పాడు. ఇక టీమ్ఇండియాలో ఏ ఆటగాడి నుంచి ముప్పు తప్పదని భావిస్తున్నారు అని ప్రశ్నించగా.. ఇది చాలా కష్టమైన ప్రశ్న అని అన్నాడు. సమాధానం చెప్పడం చాలా కష్టమైన విషయమన్నాడు. ప్రతి ఒక్క ప్లేయర్ అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శిస్తారని, బౌలింగ్‌లో మాత్రం బుమ్రా ఎదుర్కొనడం పెద్ద సవాల్ అని అన్నాడు. ఇక పిచ్ గురించి మాట్లాడుతూ.. ఎలా స్పందిస్తుందో ఇప్పుడే చెప్పలేమన్నాడు.