Vaibhav Sooryavanshi : తొలిసారి ప్లేయ‌ర్‌ ఆఫ్ ది మ్యాచ్‌, సిరీస్.. వైభ‌వ్ సూర్య‌వంశీ కీల‌క వ్యాఖ్య‌లు..

జింబాబ్వేతో జ‌రిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమ్ఇండియా న‌యా సంచ‌ల‌నం 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi) అద‌ర‌గొట్టాడు.

Vaibhav Sooryavanshi Comments After player of the match and series award winning

Vaibhav Sooryavanshi : జింబాబ్వేతో జ‌రిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమ్ఇండియా న‌యా సంచ‌ల‌నం 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ అద‌ర‌గొట్టాడు. ఈ సిరీస్‌లో త‌న ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. హ‌రారే వేదిక‌గా జ‌రిగిన మూడో మ్యాచ్‌లో 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స‌ర్ల సాయంతో 81 ప‌రుగులు సాధించి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

ఈ క్ర‌మంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అంతేకాదండోయ్ సిరీస్‌లో నిల‌క‌డ‌గా రాణించినందుకు ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు. వైభ‌వ్ సూర్య‌వంశీ కెరీర్‌లో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుల‌ను అందుకోవడం ఇదే తొలిసారి.

Vaibhav Sooryavanshi : చ‌రిత్ర సృష్టించిన వైభ‌వ్ సూర్య‌వంశీ.. ఏకైక ఆట‌గాడు..

అవార్డుల‌ను అందుకున్న త‌రువాత వైభ‌వ్ మాట్లాడుతూ సంతోషాన్ని వ్య‌క్తం చేశాడు. మేము హరారేకు వచ్చిన తర్వాత రెండు, మూడు రోజుల పాటు చాలా మంచి సన్నాహాలు చేశాం. నేను ఇంతకుముందు ఇక్కడే అండర్-19 ప్రపంచకప్ కూడా ఆడాను. అందుకే ఈ మైదానంలో ఆడటం నాకు చాలా ఇష్టం. కెప్టెన్, కోచ్‌లు, జట్టులోని ప్రతి ఒక్కరూ నన్ను నమ్మి ప్రోత్సహించారు. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను టీ20 క్రికెట్‌లో ఎలా ఆడతానో, అదే విధంగా ఈ సిరీస్‌లో కూడా ఆడాను.

జట్టుకు ఉపయోగపడేలా ఆడాలనేదే నా లక్ష్యం. మూడు మ్యాచ్‌ల్లోనూ జట్టుకు మంచి ఆరంభం ఇవ్వడానికి ప్రయత్నించాను. ఒకసారి మంచి ఆరంభం దొరికితే, దానిని పెద్ద ఇన్నింగ్స్‌గా మార్చాలని అనుకున్నాను. అదే నా ఏకైక ఆలోచన. నేను మ్యాచ్‌లో ఆడే షాట్లన్నీ ప్రాక్టీస్‌లో కూడా సాధన చేసినవే. ప్రాక్టీస్‌లో ఎలా ఆడుతానో, అదే విధంగా మ్యాచ్‌లో కూడా ఆడేందుకు ప్రయత్నిస్తాను. నా తొలి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. అవును.. ఇది నిజంగా కల నెరవేరిన క్షణం.అని వైభ‌వ్ సూర్య‌వంశీ అన్నాడు.