Vaibhav Sooryavanshi : ముక్కోణపు సిరీస్ కోసం భారత్-ఏ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్ వర్మ.. వైభవ్ సూర్యవంశీకి చోటు..
శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు సిరీస్ కోసం బీసీసీఐ భారత-ఏ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో వైభవ్ సూర్యవంశీకి (Vaibhav Sooryavanshi) చోటు లభించింది.
- Thota Vamshi Kumar
- Published on- May 15, 2026 / 02:45 PM IST
Vaibhav Sooryavanshi get placed in India A squad for the tri nation 50 over series in Sri Lanka
Vaibhav Sooryavanshi : జూన్ 9న శ్రీలంక వేదికగా భారత్-ఏ, శ్రీలంక-ఏ, అఫ్గానిస్థాన్-ఏ జట్ల మధ్య ముక్కోణపు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. నయా యువ సంచలనం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి ఈ జట్టులో చోటు దక్కింది. రియాన్ పరాగ్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు.
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ప్రతి జట్టు మిగిలిన రెండు జట్లతో రెండేసి చొప్పున మ్యాచ్‌లు ఆడతాయి. టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌లో పోటీపడతాయి. ఈ మ్యాచ్‌లు అన్ని దంబుల్లా వేదికగానే జరగనున్నాయి.
ఇక ఈ ముక్కోణపు సిరీస్ ముగిసిన తరువాత భారత్-ఏ జట్టు శ్రీలంక-ఏ జట్టుతో రెండు.. నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన జట్టును త్వరలోనే ప్రకటించనున్నారు.
ముక్కోణపు సిరీస్‌కి భారత్ ఏ జట్టు ఇదే..
తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, హర్ష్ దుబే, సూర్యాంష్ షెడ్జ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్), విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్.
