Vijay Hazare Trophy Gill Abhishek and Arshdeep named in Punjab squad
Vijay Hazare Trophy : డిసెంబర్ 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం 18 మంది సభ్యులతో కూడిన జట్టును పంజాబ్ ప్రకటించింది. ఇందులో టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, అర్ష్‌దీప్ సింగ్‌లు ఉన్నారు. ప్రభ్‌సిమ్రన్ సింగ్, నమన్ ధీర్, అన్మోల్‌ప్రీత్ సింగ్, రమణ్‌దీప్ సింగ్, సన్వీర్ సింగ్, హర్ ప్రీత్ బ్రార్ లకు చోటు దక్కింది.
కాగా.. గిల్, అభిషేక్,అర్ష్‌దీప్ లు ఎన్ని మ్యాచ్‌లు ఆడతారు అనే దానిపై స్పష్టత లేదు. టీమ్ఇండియా జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఆ తరువాత కివీస్‌తోనే జనవరి 21 నుంచి టీ20 సిరీస్ ఆడనుంది. భారత వన్డే జట్టుకు గిల్ కెప్టెన్ అన్న సంగతి తెలిసిందే. ఇక అభిషేక్, అర్ష్‌దీప్ లు టీమ్ఇండియా టీ20 జట్టులో భాగంగా ఉన్నారు.
AUS vs ENG : గెలుపు జోష్‌లో ఉన్న ఆసీస్‌కు భారీ షాక్..! ఇంగ్లాండ్‌కు ఇక పండగేనా?
విజయ్ హజారే ట్రోఫీలో (Vijay Hazare Trophy ) పంజాబ్ జట్టు లీగ్ దశలో ఏడు మ్యాచ్‌లను జైపూర్ వేదికగా ఆడనుంది. ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, గోవా, ముంబైలతో తలపడనుంది. లీగ్ మ్యాచ్ జనవరి 8న ముగుస్తాయి. కాగా.. పంజాబ్ తమ జట్టు కెప్టెన్ ఎవరు అన్నది ఇంకా వెల్లడించలేదు.
విజయ్ హజారే ట్రోఫీకి పంజాబ్ జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), హర్నూర్ పన్ను, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉదయ్ సహారన్, నమన్ ధీర్, సలీల్ అరోరా (వికెట్ కీపర్), సన్వీర్ సింగ్, రమణదీప్ సింగ్, జషన్‌ప్రీత్ సింగ్, గుర్నూర్ బ్రార్, హర్‌ప్రీత్ బ్రార్, రఘు శర్మ, క్రిష్ భగత్, గౌరవ్ చౌదరి, సుఖదీప్ బజ్వా.