×
Ad

Ishan kishan : బ్యాటుతో ఇషాన్‌ కిషన్‌ రప్పారప్పా.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా ఘనత

Ishan kishan : సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సూపర్ ఫామ్ తో పరుగుల వరద పారించిన ఇషాన్ కిషన్.. విజయ్ హజారే వన్డే టోర్నమెంట్ లోనూ తన జోరును కొనసాగించాడు.

Ishan kishan

Ishan kishan : భారత వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ బ్యాటుతో పరుగుల వరద పారిస్తున్నాడు. వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు. ఇటీవల దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 500కు పైచిలుకు పరుగులతో సత్తా చాటిన ఈ యువ ప్లేయర్.. తాజాగా.. విజయ్ హజారే వన్డే టోర్నమెంట్ లోనూ తన జోరును కొనసాగించాడు.

Also Read : Vijay Hazare Trophy : తగ్గేదేలే!.. సెంచరీలతో చెలరేగిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. బౌండరీల వర్షం

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సూపర్ ఫామ్ తో పరుగుల వరద పారించిన ఇషాన్ కిషన్.. కెప్టెన్ గా, బ్యాటర్ గా అదరగొట్టాడు. ఫలితంగా టీ20 ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. తాజాగా.. విజయ్ హజారే వన్డే టోర్నమెంట్లోనూ సెంచరీతో ఇషాన్ కిషన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగించాడు.

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బుధవారం ఎలైట్ గ్రూప్ -ఎలో అహ్మదాబాద్ వేదికగా కర్ణాటక వర్సెస్ జార్ఖండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో జార్ఖండ్ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ 33 బంతుల్లోనే శతకం బాదేశాడు. జార్ఖండ్ తరఫున ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ యువ బ్యాటర్ మొత్తంగా 39 బంతుల్లో ఏడు ఫోర్లు, 14 సిక్సర్లతో 125 పరుగులు చేశాడు. ఈ క్రమంలో చరిత్ర సృష్టించాడు.


33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి లిస్ట్ -ఎ క్రికెట్లో భారత్ తరపున రెండో వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్ గా నిలిచిన ఇషాన్.. అదేవిధంగా ఓ ప్రపంచ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. లిస్ట్ -ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ చరిత్ర సృష్టించాడు.

2019లో సిన్హలీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ తరఫున బదురేలియా స్పోర్ట్స్‌ క్లబ్‌ మీద శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ సుందన్ వీరక్కడి 39 బంతుల్లో సెంచరీ చేశాడు. తాజాగా ఆ రికార్డును ఇషాన్ కిషన్ బద్దలు కొట్టాడు. కేవలం 33 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్ గా నిలిచాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో గుజరాత్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ (41 బంతుల్లో), సౌతాఫ్రికా బ్యాటర్ మార్క్ బౌచర్ (44బంతుల్లో) సెంచరీలు చేసి నాల్గో స్థానంలో నిలిచాడు.