వినేశ్ ఫోగ‌ట్‌కు రూ. 16 కోట్లు.. ఎలాంటి డబ్బు తీసుకోలేదన్న సోమ్‌వీర్‌ రాథీ

వినేశ్ ఫోగ‌ట్‌కు కొన్ని కంపెనీలు 16 కోట్ల రూపాయల నగదు నజరానా అందించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై సోమ్‌వీర్‌ రాథీ స్పందించారు.

Vinesh Phogat has not received any money says Somvir Rathee

Somvir Rathee: ఇండియా స్టార్ వుమన్ రెజ్లర్‌ వినేశ్ ఫోగ‌ట్.. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ క్రీడోత్సవంలో కొద్దిలో పతకం కోల్పోయారు. 100 గ్రాముల అధిక బరువు కారణంగా గోల్డ్ మెడల్ చాన్స్ మిస్సయ్యారు. అయితే ఒలంపిక్స్ ఫైనల్‌లోకి ప్రవేశించిన మొదటి భారతీయ మహిళా రెజ్లర్‌గా ఆమె రికార్డు లిఖించారు. దురదృష్టకర రీతిలో పతకం కోల్పోయినా ఆమెకు భారతీయులు మద్దతుగా నిలిచారు. ఇటీవల పారిస్ నుంచి తిరిగొచ్చిన వినేశ్ ఫోగ‌ట్‌కు అపూర్వరీతిలో స్వాగతం పలికారు. అయితే కొన్ని వ్యాపార సంస్థలు ఆమెకు భారీగా నగదు నజరానాలు ఇచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని వినేశ్ భర్త సోమ్‌వీర్‌ రాథీ ఖండించారు.

వినేశ్ ఫోగ‌ట్‌కు కొన్ని కంపెనీలు 16 కోట్ల రూపాయల నగదు నజరానా అందించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై సోమ్‌వీర్‌ రాథీ స్పందించారు. “వ్యాపార సంస్థలు, వ్యాపారవేత్తలు, కంపెనీలు, పార్టీల నుంచి వినేశ్ ఫోగ‌ట్ ఎలాంటి డబ్బు తీసుకోలేదు. మీరందరూ మా శ్రేయోభిలాషులు, దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి. దీని వల్ల మనకు నష్టం జరగడమే కాకుండా సామాజిక విలువలు కూడా దెబ్బతింటాయి. చౌకగా పాపులారిటీ పొందడానికి ఇలాంటివి ప్రచారం చేస్తున్నార”ని ఎక్స్‌లో సోమ్‌వీర్‌ రాథీ పోస్ట్‌ పెట్టారు.

Also Read: యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేసిన డారియస్ విస్సర్.. ఏ దేశపు బ్యాటరో తెలుసా?

కాగా, భాగస్వామ్య సిల్వర్ మెడల్ కోసం వినేశ్ ఫోగ‌ట్‌ చేసిన విజ్ఞప్తిని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) కూడా తోసిపుచ్చడంతో ఆమెకు నిరాశ తప్పలేదు. పతకం కోల్పోయిన బాధలో శనివారం స్వదేశానికి తిరిగివచ్చిన వినేశ్ ఫోగ‌ట్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆమెకు సంఘీభావంగా బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ వంటి క్రీడాకారులతో పాటు వందలాది మంది విమానాశ్రయానికి తరలివచ్చారు. తనకు మద్దతుగా నిలిచిన దేశం మొత్తానికి వినేశ్ ఫోగ‌ట్‌ వినమ్రంతగా ధన్యవాదాలు తెలిపింది.

 

ట్రెండింగ్ వార్తలు