యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేసిన డారియస్ విస్సర్.. ఏ దేశపు బ్యాటరో తెలుసా?

డారియస్ విస్సర్ పేరు ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు అతడి గురించి ఎందుకు అంటారా? క్రికెట్ హిస్టరీలో తన పేరును అతడు లిఖించుకున్నాడు.

యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేసిన డారియస్ విస్సర్.. ఏ దేశపు బ్యాటరో తెలుసా?

Samoa batter Darius Visser break Yuvraj Singh record in T20I

Samoa batter Darius Visser: క్రికెట్‌లో సమోవా బ్యాటర్ డారియస్ విస్సర్ పేరు ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు అతడి గురించి ఎందుకు అంటారా? క్రికెట్ హిస్టరీలో తన పేరును అతడు లిఖించుకున్నాడు. ఇంటర్నేషనల్ టీ20ల్లో ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదాడు. అక్కడితో ఆగితే రికార్డ్డ్ బ్రేక్ అయ్యేదే కాదు. అంతర్జాతీయ టీ20ల్లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ రికార్డును విస్సర్ తాజాగా బద్దలు కొట్టాడు. ICC పురుషుల T20 తూర్పు ఆసియా-పసిఫిక్ రీజియన్ ప్రపంచకప్ క్వాలిఫైయర్ Aలో భాగంగా సమోవా, వనాటు దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌లో అతడీ ఘనత సాధించాడు. ఒకే ఓవర్‌లో 39 పరుగులు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.

వనాటు బౌలర్ నలిన్ నిపికో వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో విస్సర్ విశ్వరూపం చూపించాడు. మొదటి 3 బంతుల్లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. తర్వాతి నలిన్ నోబాల్ వేయడంతో ఫ్రీహిట్‌ను సిక్సర్‌గా మలిచాడు. తర్వాత డాట్ బాల్ వేసి ఊపిరి పీల్చుకున్నాడు. అయితే తర్వాత మరో నోబాల్ వేయడంతో విస్సర్‌కు మరో సిక్సర్ చాన్స్ దొరికింది. ఫ్రీ హిట్ డెలివరీలోనూ నలిన్ మరో నోబాల్ వేయగా.. దీన్ని కూడా సిక్సర్ కొట్టాడు. మొత్తానికి ఈ ఓవర్‌లో 39 పరుగులు సాధించి విస్సర్ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు.

Also Read: 9 సిక్సర్లతో 43 బంతుల్లోనే సెంచరీ బాదాడు.. ఈసారైనా ఐపీఎల్ ఆడతాడా?

కాగా, విస్సర్ విజృంభణతో ఈ మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో వనాటుపై సమోవా విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సమోవా 20 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటయింది. డారియస్ విస్సర్ ఒక్కడే సెంచరీతో చెలరేగగా మిగతా బ్యాటర్లు అంతా విఫలమయ్యారు. విస్సర్ 62 బంతుల్లో 14 సిక్స్‌లు, 5 ఫోర్లతో 132 పరుగులు చేశాడు. కెప్టెన్ కాలేబ్ జస్మత్ 21 బంతుల్లో 16 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇంటర్నేషనల్ టీ20ల్లో సెంచరీ కొట్టిన తొలి సమోవా బ్యాటర్‌గా విస్సర్ రికార్డుకెక్కాడు.