Viral Video : స్లెడ్జింగ్ చేశాడని బాలుడి పై బ్యాట‌ర్ దాడి.. షాకింగ్ వీడియో వైర‌ల్‌.. ఐపీఎల్ స్టార్‌కు క‌నెక్ష‌న్‌?

సాధార‌ణంగా సోష‌ల్ మీడియాలో క్రికెట్‌కు సంబంధించిన కొన్ని ఫ‌న్నీ వీడియోలు వైర‌ల్ (Viral Video)అవుతుండ‌డాన్ని చూస్తూనే ఉంటాం.

Viral Video Batter Attacks Boy For Sledging After Getting Out

Viral Video : సాధార‌ణంగా సోష‌ల్ మీడియాలో క్రికెట్‌కు సంబంధించిన కొన్ని ఫ‌న్నీ వీడియోలు వైర‌ల్ అవుతుండ‌డాన్ని చూస్తూనే ఉంటాం. అయితే.. ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) మాత్రం నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. ఓ బ్యాట‌ర్ ఔటైన త‌రువాత డ‌గౌట్ వెలుతుండ‌గా.. ఓ బాలుడు బూర ఊదుతూ బ్యాట్‌మెన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు.

మొద‌ట స‌ద‌రు బ్యాట‌ర్ ఆ బుడ్డోడిని పెద్ద‌గా పట్టించుకోలేదు. మ‌రో బ్యాట‌ర్‌తో మాట్లాడి వెలుతుండ‌గా కూడా బుడ్డోడు ఆగ‌లేదు. దీంతో స‌ద‌రు బ్యాట‌ర్ కాస్త కోపంతో బ్యాట్‌తో కొడుతానంటూ బుడ్డోడిని బెదిరించాడు. దెబ్బ‌కు ఆ బాలుడు అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు.

Sanju Samson vs Shubman : సంజూ శాంస‌న్ వ‌ర్సెస్‌ శుభ్‌మ‌న్ గిల్‌.. అంత‌ర్జాతీయ టీ20ల్లో ఎవ‌రు తోపు?

ఈ వీడియో ఎక్క‌డిది? ఆ మ్యాచ్ ఎక్క‌డ జ‌రిగింది వంటి వివ‌రాలు అయితే లేవు. నెటిజ‌న్లలో కొంద‌రు మాత్రం బ్యాట‌ర్ ను విమ‌ర్శించ‌గా మ‌రికొంద‌రు మాత్రం ఐపీఎల్ స్టార్ దిగ్వేష్‌ ర‌తితో ఆ బాలుడిని పోలుస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో దిగ్వేష్ ర‌తి బ్యాట‌ర్‌ను ఔట్ చేసిన త‌రువాత నోట్‌బుక్ సెల‌బ్రేష‌న్స్‌తో సెండాఫ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.