Video: వీడెవడండీ బాబు.. ఇంగ్లాండ్ vs భారత్ టెస్టుకి పాకిస్థాన్ జెర్సీ వేసుకుని వచ్చాడు.. రచ్చ రచ్చే..

‘‘ఇక్కడ ఎవరూ అభ్యంతరం చెప్పలేదు, చుట్టూ ఉన్న భారత అభిమానులు కూడా కంఫర్టబుల్‌గా ఉన్నారు’’ అంటూ అతడు తన వైపు వాదనలు వినిపించాడు.

Pakistan Jersey Row

ఇంగ్లాండ్‌-భారత్‌ మధ్య ఓల్డ్ ట్రాఫర్డ్‌లో జరిగిన నాల్గో టెస్టు మ్యాచ్ సమయంలో ఒక అభిమాని పాకిస్థాన్ క్రికెట్ జెర్సీ ధరించి స్టేడియానికి మ్యాచ్ చూడడానికి వచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

మ్యాచ్‌కి సంబంధం లేని దేశాల జెర్సీలను ఆ స్టేడియంలో అనుమతించరు. ఈ నిబంధనల ప్రకారం.. సెక్యూరిటీ సిబ్బంది ఆ అభిమానిని నిలదీశారు. అయితే ఆ అభిమాని మాత్రం తన జెర్సీని తొలగించడాన్ని నిరాకరించాడు. ‘‘ఇక్కడ ఎవరూ అభ్యంతరం చెప్పలేదు, చుట్టూ ఉన్న భారత అభిమానులు కూడా కంఫర్టబుల్‌గా ఉన్నారు’’ అంటూ అతడు తన వైపు వాదనలు వినిపించాడు.

వివాదం మరింత చెలరేగడంతో అదనపు సెక్యూరిటీ సిబ్బంది, స్థానిక పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితిని నియంత్రించాల్సి వచ్చింది.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల అభిప్రాయాలు విభిన్నంగా వ్యక్తమయ్యాయి.

కొంతమంది అభిమానికి మద్దతుగా నిలిచి.. స్వేచ్ఛను హరిస్తున్నారంటూ స్టేడియం సిబ్బందిని విమర్శించారు. మరికొంతమంది మాత్రం స్టేడియంలో ఉన్న నిబంధనలు ఫాలో కావాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయంలో ఆ మ్యాచ్‌లకి సంబంధించిన జట్లకే మద్దతుగా అభిమానులు దుస్తులు ధరించాలనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో ఆ అభిమాని చర్యపై స్టేడియం సిబ్బంది స్పందించినట్లు తెలుస్తోంది.