Virat and Rohit to set new record for India in three match series against Australia
Virat Kohli-Rohit Sharma : అక్టోబర్ 19 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. చివరిసారిగా వీరిద్దరు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు తరుపున కలిసి ఆడారు. వీరిద్దరు టెస్టులు, టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు వన్డేలు మాత్రమే ఆడుతున్నారు.
2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలను ఈ సిరీస్‌తోనే టీమ్ఇండియా ప్రారంభించబోతుంది. అదే సమయంలో ఈ సిరీస్‌లో విఫలం అయితే రోహిత్, కోహ్లీలకు (Virat Kohli-Rohit Sharma) ఇదే చివరి సిరీస్ కావొచ్చుననే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ లపైనే ఉంది.
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా గడ్డ పై వన్డేల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జంటగా రికార్డులకు ఎక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రికార్డు శిఖర్ ధావన్-విరాట్ కోహ్లీ పేరిట ఉంది.
కోహ్లీ-గబ్బర్ లు 6 ఇన్నింగ్స్‌ల్లో 656 భాగస్వామ్య పరుగులు చేశారు. రెండో స్థానంలో రవిశాస్త్రి, శ్రీకాంత్ జోడీ ఉంది. రవి-శ్రీకాంత్ జోడి 19 ఇన్నింగ్స్‌ల్లో 630 పరుగులు చేశారు. ఇక ఈ జాబితాలో కోహ్లీ-రోహిత్ జోడీ మూడో స్థానంలో ఉన్నారు. వీరు 601 భాగస్వామ్య పరుగులు సాధించారు.
ఆసీస్ జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో వీరిద్దరు జంటగా మరో 56 పరుగులు సాధిస్తే.. ఆస్ట్రేలియాలో వన్డేల్లో అత్యధిక భాగస్వామ్య పరుగులు చేసిన భారత జోడీగా చరిత్ర సృష్టిస్తారు.
ఆస్ట్రేలియాలో వన్డేల్లో అత్యధిక భాగస్వామ్య పరుగులు చేసిన భారత జంటలు ఇవే..
* శిఖర్ ధావన్-విరాట్ కోహ్లీ – 656 పరుగులు
* రవిశాస్త్రి-శ్రీకాంత్ – 630 పరుగులు
* విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ – 601 పరుగులు
* శిఖర్ ధావన్- రోహిత్ శర్మ – 548 పరుగులు
* వీరేంద్ర సెహ్వాగ్-సచిన్ టెండూల్కర్ – 530 పరుగులు