Mohammed shami : ఐదు బంతుల్లో మూడు వికెట్లు.. సెలెక్టర్లకు సవాల్ విసిరిన షమీ.. నా ఫిట్‌నెస్ ఇదీ..
రంజీ ట్రోఫీలో మహ్మద్ షమీ (Mohammed shami) దుమ్ములేపాడు. 5 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టాడు.

Ranji Trophy Bengal vs Uttarakhand Mohammed shami took 3 wickets in 5 balls
Mohammed shami : ఆసీస్‌తో అక్టోబర్ 19 నుంచి జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు మహ్మద్ షమీని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. అతడి ఫిట్‌నెస్ పై తమకు ఎలాంటి అప్‌డేట్ లేదని, అందుకనే అతడిని జట్టు ఎంపికలోకి పరిగణలోకి తీసుకోలేదని ఆసీస్‌తో సిరీస్‌లకు జట్టుకు ప్రకటించిన సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పిన సంగతి తెలిసిందే.
కట్ చేస్తే.. నాలుగు బంతుల్లో మూడు వికెట్లు తీసి షమీ తన ప్రదర్శనతో సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. రంజీట్రోఫీ 2025-26 సీజన్ నేటి నుంచే ప్రారంభమైంది. బెంగాల్ తరుపున బరిలోకి దిగిన షమీ ఉత్తరాఖండ్‌తో ప్రారంభమైన మ్యాచ్‌లో చెలరేగాడు. తన ఫిట్‌నెస్ పై ఉన్న సందేహాలను పటాపంచలు చేస్తూ ఏకంగా 14.5 ఓవర్లు వేశాడు. మూడు వికెట్లు తీశాడు. ఈ మూడు వికెట్లను కూడా ఒకే ఓవర్‌లో 5 బంతుల వ్యవధిలోనే పడగొట్టడం విశేషం.
Pat Cummins : రోహిత్, కోహ్లీలను చూసేందుకు ఇదే చివరి అవకాశం కావొచ్చు.. పాట్ కమిన్స్ కామెంట్స్..
సూరజ్ సింధు జైస్వాల్ నాలుగు వికెట్లు తీయగా, షమీ, ఇషాన్ పోరెల్‌లు చెరో మూడు వికెట్లు తీయడంతో ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 72.5 ఓవర్లలో 213 పరుగులకే పరిమితమైంది. ఉత్తరాఖండ్ బ్యాటర్లలో భూపేన్ లాల్వానీ (71) హాఫ్ సెంచరీ చేశాడు.
నాలుగు రోజులు ఆడగలిగినప్పుడు.. 50 ఓవర్లు ఆడలేనా..
కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు షమీ మాట్లాడుతూ టీమ్ఇండియా సెలక్టర్ల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఫిట్‌నెస్ గురించి సెలెక్షన్ కమిటీకి సమాచారం అందించడం తన పని కాదన్నాడు. తనకు ఫిట్‌నెస్ సమస్యలు ఉంటే బెంగాల్ తరుపున రంజీ క్రికెట్ ఎందుకు ఆడతానని ప్రశ్నించాడు. ఇప్పుడు టీమ్ సెలెక్షన్ గురించి మాట్లాడి వివాదం సృష్టించాల్సిన అవసరం లేదన్నాడు.
రంజీల్లో 4 రోజులు ఆడగలిగినప్పుడు 50 ఓవర్ల క్రికెట్ ఆడలేనా? అని ప్రశ్నించాడు. ఫిట్‌నెస్ గురించి అడగడం, చెప్పడం, సమాచారం ఇవ్వడం తన బాధ్యత కాదనీ.. ఎన్‌సీఏకు వెళ్లి సిద్ధం కావడం, మ్యాచ్ ఆడడమే తన పని అని చెప్పుకొచ్చాడు.