Virat Kohli : చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. క్రికెట్ దేవుడి రికార్డు బ్రేక్‌..

ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లి (Virat Kohli ) చ‌రిత్ర సృష్టించాడు. వ‌న్డేల్లో అత్య‌ధిక వేగంగా 13వేల ప‌రుగులు మైలురాయిని చేరుకున్న మొద‌టి క్రికెటర్‌గా నిలిచాడు.

Virat Kohli

Virat Kohli record : ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లి (Virat Kohli ) చ‌రిత్ర సృష్టించాడు. వ‌న్డేల్లో అత్య‌ధిక వేగంగా 13వేల ప‌రుగులు మైలురాయిని చేరుకున్న మొద‌టి క్రికెటర్‌గా నిలిచాడు. ఆసియాక‌ప్ ( Asia Cup) 2023లో భాగంగా సూప‌ర్-4 ద‌శ‌లో కొలంబో వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న వ‌న్డే మ్యాచులో విరాట్ ఈ ఘ‌న‌త సాధించాడు. ఈ క్ర‌మంలో భార‌త దిగ్గ‌జ ఆట‌గాడు, క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును బ్రేక్ చేశాడు.

సచిన్ 321 ఇన్నింగ్స్‌ల్లో 13 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకోగా విరాట్‌ 267 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘ‌న‌త‌ను సాధించాడు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ ఆట‌గాడు రికీ పాంటింగ్ (341), శ్రీలంక మాజీ ఆట‌గాడు కుమార సంగ‌క్క‌ర (363), శ్రీలంక‌కే చెందిన స‌న‌త్ జ‌య‌సూర్య (416) ఆ త‌రువాతి స్థానాల్లో ఉన్నారు.

Khalid Latif : పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌ కు భారీ షాక్ ఇచ్చిన డచ్ కోర్టు

ఈ మ్యాచులో కోహ్లీ 94 బంతుల్లో 9 పోర్లు, 3 సిక్స‌ర్ల సాయంతో 122 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. విరాట్ కోహ్లీకి ఇది వ‌న్డేల్లో 47 శ‌త‌కం కాగా.. అంత‌ర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల‌ల‌లో క‌లిపి 77వది కావ‌డం విశేషం. స‌చిన్ టెండూల్క‌ర్ 100 శ‌త‌కాల‌తో తొలి స్థానంలో ఉండ‌గా విరాట్ కోహ్లీ అత‌డిని అనుస‌రిస్తున్నాడు. ప్ర‌స్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో ఇంగ్లాండ్ ఆట‌గాడు జో రూట్‌, ఆసీస్ ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్ చెరో 46 శ‌త‌కాలు, రోహిత్ శ‌ర్మ 44 సెంచ‌రీల‌తో కొన‌సాగుతున్నారు.

వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితా..

స‌చిన్ టెండూల్క‌ర్ (భార‌త్‌)- 18426
కుమార సంగక్కర (శ్రీలంక‌)- 14234
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 13704
స‌న‌త్ జ‌య‌సూర్య (శ్రీలంక‌)- 13430
విరాట్ కోహ్లీ (భార‌త్‌)- 13024

MS Dhoni: ఆటోగ్రాఫ్ ఇచ్చి చాక్లెట్ తీసుకున్న ధోనీ.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు