Virat Kohli Becomes The Fastest To Score 27000 Runs In International Cricket
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి) అత్యంత వేగంగా 27 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో 35 పరుగులు చేసిన అనంతరం కోహ్లీ ఈ ఘనత సాధించాడు. కోహ్లీ తాజా ఇన్నింగ్స్‌తో కలిపి 594 ఇన్నింగ్స్‌ల్లోనే 27 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
అంతక ముందు ఈ రికార్డు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 623 ఇన్నింగ్స్‌లో దీన్ని సాధించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో 27 వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ఆటగాడిగా, రెండో భారత ప్లేయర్‌గా కోహ్లీ రికార్డులకు ఎక్కాడు.
27 వేల పరుగుల మైలురాయిని అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో చేరిన ఆటగాళ్లు
విరాట్ కోహ్లీ (భారత్) – 594 ఇన్నింగ్స్‌లు
సచిన్ టెండూల్కర్ (భారత్) – 623 ఇన్నింగ్స్‌లు
కుమార సంగక్కర (శ్రీలంక) – 648 ఇన్నింగ్స్‌లు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 650 ఇన్నింగ్స్‌లు
IND vs BAN : చరిత్ర సృష్టించిన భారత్.. టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఉన్నారు. టెండూల్కర్ తన కెరీర్‌లో 34,357 పరుగులు చేశాడు. ఆ తరువాత కుమార సంగక్కర, రికీ పాంటింగ్‌లు ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
సచిన్ టెండూల్కర్ – 34,357 పరుగులు
కుమార సంగక్కర – 28,016 పరుగులు
రికీ పాంటింగ్ – 27,483 పరుగులు
విరాట్ కోహ్లీ – 27,000 పరుగులు
మహేలా జయవర్ధనే – 25, 957 పరుగులు
జాక్వెస్ కలిస్ – 25,534 పరుగులు
VIRAT KOHLI COMPLETES 27,000 INTERNATIONAL RUNS…!!! 🇮🇳
THE GOAT OF CRICKET. 🐐 pic.twitter.com/Zb9pUiEx9K
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 30, 2024