IND vs BAN : చరిత్ర సృష్టించిన భారత్.. టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ
టెస్టుల్లో టీమ్ఇండియా అరుదైన ఘనత సాధించింది.

India breaks record for fastest team 100 runs in Test cricket
India vs Bangladesh : టెస్టుల్లో టీమ్ఇండియా అరుదైన ఘనత సాధించింది. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఈ ఘనత సాధించింది. 10.1 ఓవర్లలోనే (61 బంతుల్లోనే) జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. కాగా.. గతంలో ఈ రికార్డు టీమ్ఇండియా పేరిటే ఉండడం విశేషం. 2023లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచులో భారత్ 12.2 ఓవర్లలో 100 పరుగులు సాధించింది.
టెస్టుల్లో వేగవంతంగా తొలి 100 పరుగులు చేసిన జట్లు (ఓవర్ల పరంగా)
* 2024లో బంగ్లాదేశ్ పై భారత్ 10.1 ఓవర్లలో (వేదిక కాన్పూర్)
* 2023లో వెస్టిండీస్ పై భారత్ 12.2 ఓవర్లలో (వేదిక ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్)
* 2001లో బంగ్లాదేశ్ పై శ్రీలంక 13.1 ఓవర్లలో (వేదిక కొలంబో)
* 2012లో వెస్టిండీస్ పై బంగ్లాదేశ్ 13.4 ఓవర్లలో (వేదిక మీర్పూర్)
* 2022లో పాకిస్థాన్ పై ఇంగ్లాండ్ 13.4 ఓవర్లలో (వేదిక కరాచీ)
* 2022లో పాకిస్థాన్ పై ఇంగ్లాండ్ 13.4 ఓవర్లలో (వేదిక రావల్పిండి)
ఇక ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం మూడు ఓవర్లు (18) బంతుల్లోనే 50 పరుగులు చేసింది. దీంతో 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన జట్టుగా రికార్డులకు ఎక్కింది. గతంలో ఈ రికార్డు ఇంగ్లాండ్ పేరిట ఉండగా భారత్ బద్దలు కొట్టింది.
టెస్టుల్లో అత్యంత వేగంగా తొలి 50 పరుగులు చేసిన జట్లు (ఓవర్ల పరంగా )
* బంగ్లాదేశ్ పై భారత్ 3 ఓవర్లలో (2024లో వేదిక కాన్పూర్)
* వెస్టిండీస్ పై ఇంగ్లాండ్ 4.2 ఓవర్లలో (2024లో వేదిక నాటింగ్‌హామ్)
* దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ 4.3 ఓవర్లలో (1994లో వేదికగా ఓవల్)
* శ్రీలంక పై ఇంగ్లాండ్ 4.6 ఓవర్లలో (2002లో వేదిక మాంచెస్టర్)
* పాకిస్థాన్ పై శ్రీలంక 5.2 ఓవర్లలో (2004లో వేదిక కరాచీ)
* ఇంగ్లాండ్ పై భారత్ 5.3 ఓవర్లలో (2008లో వేదిక చెన్నై)
* వెస్టిండీస్ పై భారత్ 5.3 ఓవర్లలో (2023లో వేదిక ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్)
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు కుప్పకూలింది. బంగ్లా బ్యాటర్లలో మోమినుల్ హక్ (107 నాటౌట్ ) శకతంతో చెలరేగాడు. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీశాడు. సిరాజ్, అశ్విన్, ఆకాశ్ దీప్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా ఓ వికెట్ సాధించాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ దంచి కొడుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ 11 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్ల సాయంతో 23 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (49 బంతుల్లో 72) మెరుపు హాప్ సెంచరీ చేయగా గిల్ (19 బంతుల్లో 26) దూకుడుగా ఆడుతున్నారు. ప్రస్తుతం భారత్ 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 123 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ స్కోరుకు ఇంకా 110 పరుగుల వెనుకబడి ఉంది.